మాయ చేస్తోన్న పాయల్..
RX100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మాయాపేటిక’. రమేశ్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలైంది.
image: instagram
గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న పాయల్.. థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది. తన కెరీర్‌లో ఈ చిత్రం చాలా ముఖ్యమైనదని గత ఇంటర్వ్యూల్లో తెలిపింది.
image: instagram
దిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ చదువు పూర్తి కాగానే.. నటనలో డిప్లొమా చేసింది. 2012లో ‘సప్నన్ సే భారే నైనా’ అనే హిందీ సీరియల్‌తో బుల్లితెరపై మెరిసింది.
image: instagram
‘చన్న మెరియా(2017)’ అనే పంజాబీ సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2018లో వచ్చిన ‘RX 100’తో టాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించింది.
image: instagram
తొలి సినిమా హిట్ కావడం.. పాయల్‌కు యూత్ ఫిదా కావడంతో వరసగా అవకాశాలొచ్చాయి. అలా ‘ఆర్డీఎక్స్ లవ్’,‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’, ‘తీన్‌మార్’, ‘జిన్నా’ ఇలా తెలుగుతోపాటు పంజాబీ, తమిళ్, కన్నడ భాషల్లో పలు చిత్రాలు చేసింది.
image: instagram
ఓటీటీ కోసం ‘త్రీ రోజెస్’ వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. తెలుగులో నటిస్తూ బిజీగానే ఉన్నా.. ఈ భామకి ఆశించిన బ్రేక్ రావట్లేదు. ఇప్పుడు ‘మాయాపేటిక’తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
image: instagram
మరోవైపు తనకు తెలుగు చిత్రంలో మొదట అవకాశమిచ్చిన దర్శకుడు అజయ్ భూపతితో కలిసి ఓ సినిమా చేస్తోంది. ‘మంగళవారం’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దర్శకుడు అజయ్.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
image: instagram
ఈ దిల్లీ బ్యూటీకి డ్యాన్స్ చేయటం చాలా ఇష్టం. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె.. తన గ్లామర్ పిక్స్‌తోపాటు.. డ్యాన్స్ వీడియోలనూ పోస్టు చేస్తుంటుంది.
image: instagram
తన బిజీ షెడ్యూల్‌లో ఎప్పుడు ఖాళీ దొరికినా పుస్తకాలు చదువుతూ, ట్రిప్పులకి వెళుతూ.. పని ఒత్తిడిని తగ్గించుకుంటుందట.
image: instagram
ఒకప్పుడు పాయల్ అతిగా మొబైల్ వాడేదట. ఆ మొబైల్ అడిక్షన్ నుంచి తాను బయటపడ్డానని, అందరూ మొబైల్ వాడకం తగ్గిస్తేనే జీవితంలో ముఖ్యమైన క్షణాలను ఆస్వాదించగలరని అంటోంది. ‘మాయాపేటిక’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ విషయం చెప్పింది.
image: instagram