బంగీ జంప్‌.. లాంగ్‌ డ్రైవ్‌.. మంచు ట్రిప్‌

‘ప్రసన్న వదనం’తో తెలుగు తెరకు సుపరిచితమైన పాయల్‌ రాధాకృష్ణ ఇప్పుడు ‘నీలి మేఘ శ్యామ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి రవి ఎస్‌ వర్మ దర్శకత్వం వహించారు. జనవరి 9నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

‘తరగతి గది దాటి’ వెబ్‌సిరీస్‌తో పాటు ‘భిన్నా’, ‘లైఫ్‌ 360’, ‘సింగపెన్నె’, ‘నిమ్మోల్లారా ఆశీర్వాద’, ‘మధురమే ఈ క్షణం’, ‘అలా నిన్ను చేరి’, ‘బెంగళూర్‌ అండర్‌ వరల్డ్‌’ చిత్రాల్లో నటించింది.

పాయల్‌కు స్నేహితుల గ్యాంగ్‌ పెద్దదే.. విదేశాల్లో ఉన్న వారిని అప్పుడప్పుడూ కలుసుకొని సందడి చేస్తుంటుంది.

పండగల వేళ కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తుందీ కన్నడ భామ.

మంచు ప్రదేశాలు అంటే ఇష్టం. మంచుతో ఆడుకోవడానికి ఏటా చలికాలంలో ఓ ట్రిప్‌ వేస్తుంది.

బోర్‌ కొడితే చాలు.. కారెక్కి పాటలు పెట్టుకొని చిల్‌ అవుతూ లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్తుంది. కారులో డ్యాన్స్‌ చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది పాయల్‌.

అప్పుడప్పుడూ అడ్వంచర్లు చేయాలి. ముసలి వాళ్లు అయిన తర్వాత తలచుకోడానికి కొన్ని జ్ఞాపకాలు ఉండాలిగా అంటూ.. బంగీ జంప్‌లు చేస్తుంటుంది.

‘నా మూడ్‌ని సెట్‌ చేసేది.. బైక్‌ రైడింగ్‌. కోపం, బాధ, ఏడుపు ఇలా ఏ ఎమోషన్‌లో ఉన్నా బైక్‌ నడుపుతాను. ఇది నన్ను తెలియకుండానే రిఫ్రెష్‌ చేస్తుంది’ అని చెప్పింది. 

‘హాట్‌ చాక్లెట్‌ అదో ఎమోషన్‌’.. అంటూ ఖాళీ సమయం దొరికితే పాయల్‌ బయటకు వెళ్లి హాట్‌ చాక్లెట్‌ను ఆస్వాదిస్తుంది.

కన్నప్ప లుక్స్‌ చూశారా..!

అప్పుడు ‘నెమలి’లా ఆడాలనిపిస్తుంది

‘టచ్‌లో ఉండమంటూ..’ చంద్రికా రవి గురించి తెలుసా?

Eenadu.net Home