ఆ సీన్లకు ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇవ్వాల్సిందే!

‘బెంగళూరు అండర్ వరల్డ్‌’తో కన్నడ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్‌ రాధాకృష్ణ. ఇప్పుడు ‘ప్రసన్నవదనం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.  

అర్జున్‌ వైకే దర్శకత్వం వహిస్తున్న ‘ప్రసన్న వదనం’లో సుహాస్‌ హీరో. మే 3న సినిమా విడుదల కానుంది. ‘చారీ పాఠం’ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది.

This browser does not support the video element.

‘తరగతి గది దాటి’ వెబ్‌సిరీస్‌తో పాటు ‘భిన్నా’, ‘లైఫ్‌ 360’, ‘సింగపెన్నె’, ‘నిమ్మోల్లారా ఆశీర్వాద’, ‘మధురమే ఈ క్షణం’, ‘అలా నిన్ను చేరి’ తదితర చిత్రాలతో అలరించింది.  

పాయల్‌ కర్ణాటకలో పుట్టింది. చదువంతా బెంగళూరులోనే సాగింది. కాలేజీ రోజుల్లోనే ‘ద మెగా మోడల్‌ హంట్‌’లో ఫైనలిస్ట్‌. 

ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది. 

సినిమా పరిశ్రమలోకి వచ్చేందుకు కుటుంబం ఒప్పుకోకపోతే పట్టుబట్టి మరీ యాక్టింగ్‌లో డిప్లొమా చేసింది.

This browser does not support the video element.

పాయల్‌ తల్లి క్లాసికల్‌ డ్యాన్స్‌ర్‌. ఓ అకాడమీని నడుపుతున్నారు. పాయల్‌కు చిన్నతనం నుంచి సంప్రదాయ నృత్యం అంటే ఆసక్తి. స్కూలు, కాలేజీ రోజుల్లో స్టేజీ ప్రదర్శనలు ఇచ్చింది. 

19 ఏళ్ల వయసులోనే సినిమాల్లో తొలి అవకాశం వచ్చింది. తల్లిదండ్రులిద్దరూ బిజీగా ఉండటం వల్ల తనతో ఒక్కసారి కూడా సెట్స్‌కి రాలేదు. 

‘మొదట్లో నాకు భాష మరీ ఇబ్బందిగా అనిపించేది. యాడ్‌లు చేసేటప్పుడు చాలా మంది నాపై విమర్శలు చేశారు. అందుకే తెలుగు మాట్లాడటం నేర్చకున్నాను’ అంటోందీ బ్యూటీ.

This browser does not support the video element.

పెంపుడు జంతువులంటే ఇష్టం లేదు. యాడ్స్‌లో కానీ, సినిమాలో కానీ వాటితో సీన్‌ చేయాలంటే ఎక్కువ ఛార్జ్‌ చేస్తానని చెప్పింది. 

అల్లు అర్జున్‌, మహేష్‌ బాబుతో నటించడానికి ఎదురు చూస్తోందట. కోలీవుడ్‌లో ధనుష్‌కి అభిమాని. 

బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం. బోర్‌ కొట్టినప్పుడల్లా సింగిల్‌గా రైడ్‌కి వెళ్తుంది. సగటు అమ్మాయిలా స్నేహితులతో పార్టీలు, ఫంక్షన్లలో ఎంజాయ్‌ చేస్తుంది.

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

రకుల్‌ప్రీత్‌ ఫిజీ డైరీస్‌

ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌

Eenadu.net Home