పాయల్‌ ఇంటిపై బైక్‌ బొమ్మ.. ఎందుకో తెలుసా?

‘ఆర్‌ఎక్స్‌ 100’తో తెలుగు తెరకు పరిచయమైంది పాయల్‌ రాజ్‌పుత్‌. ప్రస్తుతం ఆమె ‘వెంకటలచ్చిమి’లో కీలక పాత్ర పోషిస్తోంది.

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ముని దర్శకుడు. యాక్షన్ రివేంజ్ స్టోరీగా ‘వెంకటలచ్చిమి’ని ఆరుభాషల్లో చిత్రీకరిస్తున్నారు.

పంజాబ్‌లో పుట్టి పెరిగిన పాయల్‌ అక్కడే స్కూలు విద్యను, దిల్లీలో కాలేజీ చదువును పూర్తి చేసింది.

యాక్టింగ్‌లో డిప్లొమా పూర్తి చేసిన పాయల్‌ కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ చేసింది. డిగ్రీ పూర్తయ్యాక యాంకరింగ్‌ చేస్తున్నప్పుడే ‘నటనపై ఆసక్తి కలిగింది’ అని చెప్పింది.

‘సప్నో సే భరే నైనా’, ‘ఆఖిర్ బహూ బీ తో భేటీ హీ హై’, ‘గుస్తాక్‌ దిల్‌’, ‘మహాకుంభ్‌’ వంటి సీరియల్స్‌లో నటించి బుల్లితెరపైనా సందడి చేసింది.

నాలుగేళ్ల వయసులోనే చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటనను ప్రారంభించిన పాయల్‌ ‘చన్నా మేరేయా’(పంజాబీ)తో వెండితెరకు పరిచయమైంది.

‘నా దృష్టిలో ప్రేమ ఓ అందమైన అనుభూతి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమలో పడతారు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి ప్రేమలోపడ్డా’ అని ఓ సందర్భంలో చెప్పింది.

‘షూటింగ్‌ నుంచి విరామం దొరికితే షాపింగ్‌కి వెళ్లాల్సిందే.. ఇటాలియన్‌ ఛీజ్‌బర్గర్‌ తినాల్సిందే’ అంటుంది.

‘ఆర్‌ఎక్స్‌ 100’కు పారితోషికంగా వచ్చిన డబ్బుతోనే సొంతింటి కలను నెరవేర్చుకున్న పాయల్‌ దానికి గుర్తుగా.. ఇంటిపై ఒక బైక్‌ బొమ్మను కూడా పెట్టుకుంది.

రాత్రివేళల్లో బాల్కనీలో కూర్చుని కృష్ణకుమార్‌(కెకె) మ్యూజిక్‌ వింటూ దాంతో పాటు తను కూడా రాగం తీస్తుంది.

ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇచ్చే పాయల్‌ జిమ్‌లో ఎక్కువ సమయం వర్కౌట్లు చేస్తుంది. అదే తనని రోజుమొత్తం యాక్టివ్‌గా ఉంచుతుంది అంటుంది.

ఓల్డ్‌ + న్యూ= కొత్త రెట్రో

ముక్కు పుడక.. మస్తుంది మేడం!

బరువు సంగతి.. జిమ్‌లో చూసుకుందాంలే!

Eenadu.net Home