చిత్రం చెప్సే విశేషాలు..!

(25-05-2023/1)

అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో బ్రహ్మ కమలాలు వికసించాయి. ఈ గ్రామానికి చెందిన కోరిబిల్లి హరీష్‌ ఇంటి వద్ద ఈ అరుదైన కమలాలు బుధవారం పూశాయి. వీటిని ఆయుర్వేద వైద్యంలోనూ వినియోగిస్తారు.

Source: Eenadu

రెండు బండ్లను ఒకే డ్రైవర్‌ ఎలా నడుపుతారా అని ఆలోచిస్తున్నారా.. ఈ చిత్రం చూస్తే ఔరా అనక మానరు. ఓ చిరు వ్యాపారి తన ద్విచక్ర వాహనానికి నాలుగు చక్రాలతోపుడు బండిని కట్టుకొని వరంగల్‌-ఖమ్మం ప్రధాన రహదారిలో వెళుతూ కనిపించారు. 

Source: Eenadu

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెంట్రల్‌ లైటింగ్‌ వెలుగులు విరజిమ్ముతున్నాయి. స్థానిక సీఈఆర్‌ క్లబ్‌ నుంచి పోస్టాఫీస్‌ వరకు మొదటి విడతగా చేపట్టిన పనులు దాదాపు పూర్తి చేశారు. 

Source: Eenadu

ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యుత్ స్తంభం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్‌కు వెళ్లేదారిలో కల్వర్టు దగ్గర ఉంది. దీనికి నిలువెత్తుగా చుట్టూ చెట్లు పెరిగాయి. పచ్చని తీగలు విద్యుత్‌ సరఫరా అయ్యె తీగలను అల్లుకుంది. 

Source: Eenadu

మహబూబాబాద్‌- దంతాలపల్లి అంబేడ్కర్‌ కూడలిలో ఓ ట్రాలీ ఆటోలో కోడిగుడ్లను తీసుకొచ్చి దుకాణాలకు సరఫరా చేస్తుండగా, అక్కడే ఉన్న ఓ కోతి రెండు గుడ్లను తీసుకొని పరుగుతీసింది. ఒక గుడ్డును కాళ్ల కింద దాచుకొని మరొక గుడ్డును తినేందుకు ప్రయత్నించింది. 

Source: Eenadu

చుట్టూ పచ్చని పొలాలు.. అప్పుడప్పుడూ సూర్యుడిని కమ్ముకున్న మబ్బులతో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా మారింది. పరవశించిన మయూరం పురివిప్పింది. ఫరూఖ్‌నగర్‌ మండలం అన్నారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద ఈ దృశ్యం కనిపించింది. 

Source: Eenadu

హనుమకొండ బాలసముద్రంలోని స్విమ్మింగ్‌ పూల్‌తో పాటు ప్రైవేట్‌ ఈత కొలనులు నగరంలో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో చిన్నారులు, పెద్దలు సభ్యత్వం తీసుకుంటున్నారు. వేసవితాపం నుంచి ఉపశమనం పొందడానికి ఈత కొలనుల్లో ఆడుతున్నారు.

Source: Eenadu

జూన్‌ 2 నుంచి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్న సందర్భంగా హైదరాబాద్‌లోని నూతన సచివాలయం బుధవారం మువ్వన్నెల విద్యుత్తు వెలుగుల్లో తళుకులీనింది.

Source: Eenadu

భారత త్రివర్ణ పతాకం వెలుగులతో అలంకరించిన సిడ్నీలోని ఒపేరా హౌస్‌ ఎదుట భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు మోదీ, ఆంథోనీ ఆల్బనీస్‌

Source: Eenadu

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారులు

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (24-04-2024/1)

బెంగళూరులో వర్షాలు.. ప్రణీత సంబరాలు

చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024/1)

Eenadu.net Home