చిత్రం చెప్పే విశేషాలు..!

(15-02-2023/1)

పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన సందర్భంగా ‘అమరుల దినోత్సవం’ నేపథ్యంలో ఈనెల 14న నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్‌ రావి ఆకులపై చిత్రాన్ని వేశారు. 

source:eenadu

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం సమీపంలో సెల్ఫీ పాయింట్‌ కూడలి వెనుక రహదారి మధ్యలో విద్యుత్తు స్తంభం ఉంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు.

source:eenadu

నిర్మల్‌ జిల్లా కడెం మండలం కాసుగూడెం, కన్నాపూర్, గోండు గూడెం రైతులు పొలాలకు వెళ్లడానికి డబ్బాలను సేకరించి కర్రలు అమర్చి తాళ్లు కట్టి వంతెనలా చేసుకొని రాకపోకలు సాగిస్తున్నారు.

source:eenadu

తుర్కియేలోని గాజియాన్‌తెప్‌లో భవనాల శిథిలాల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారం ముందు ఓ చిన్నారి

source:eenadu

తెలంగాణ సచివాలయానికి డా. బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా ప్రధాన ద్వారంపై తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో రాయించారు.

source:eenadu

ఈ చిత్రాన్ని చూస్తుంటే పెట్రోల్‌ బంక్‌లో నీటిని కలిపేందుకు భారత్‌ పెట్రోలియం ట్యాంకర్‌ వాహనాన్ని వినియోగిస్తున్నట్లు ఉన్నట్లుంది కదూ.. వరంగల్‌ జిల్లా ఆరెపల్లి నుంచి గుడెప్పాడ్‌ వరకు రోడ్డు పనులకు ఓ గుత్తేదారుడు ఖాళీగా ఉన్న ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ తీసుకొచ్చారు. 

source:eenadu

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలోని గార్లగడ్డ తండా వద్ద మల్లన్నగండి జలాశయం పరిసరాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి..జలాశయం తూము బయటకు పారుతున్న నీరు జలపాతంలా అనుభూతినిస్తోంది.

source:eenadu

సూర్యలంక తీరానికి వలస పక్షుల రాక కొనసాగుతోంది. స్థానిక అటవీ ప్రాంతంలో నల్లతల ఆకురాయి పక్షులు మంగళవారం కనిపించాయి. 

source:eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

Eenadu.net Home