చిత్రం చెప్పే విశేషాలు..!
(17-02-2023/1)
మహా శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్‌లో బ్రహ్మకుమారీస్ వెస్ట్‌మారేడుపల్లి శాఖ ఆధ్వర్యంలో జింఖానా గ్రౌండ్స్‌లో 66 అడుగుల శివలింగాన్ని రూపొందించారు.
source:eenadu
వృక్షాలపై ఉన్న పత్రాలు ఎండిపోయి రాలిపోతుంటాయి. నిర్మల్ గ్రామీణ మండలం తాంశ నుంచి చిట్యాల్ వెళ్లేమార్గంలో ఉన్న ఈ చెట్ల ఆకులు కొత్త రంగుతో అందంగా ఉన్నాయనిఆసక్తిగా చూస్తున్నారు.
source:eenadu
మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశంతో గురువారం కేరళలోని ఎర్నాకుళంలో సంప్రదాయ తిరువతిరై నృత్యాన్ని ప్రదర్శిస్తున్న వస్త్ర పరిశ్రమ మహిళా సిబ్బంది.
source:eenadu
ఇల కైలాస క్షేత్రంలో దేవదేవుల పుష్పపల్లకీ మహోత్సవం గురువారం నేత్రశోభితంగా జరిగింది. దివ్యమనోహర రూపంలో తరలొచ్చిన స్వామిఅమ్మవార్లను తిలకించిన భక్తజనం ఆనందపరవశులయ్యారు.
source:eenadu
విశాఖలో జరుగుతున్న గ్లోబల్ టెక్ సదస్సుకు వివిధ దేశాల నుంచి యువ ఐటీ ఉద్యోగినులు వచ్చారు. తమ సంప్రదాయ విధానంలో అల్లుకున్న జడలతో సమావేశానికి రావడంతో అందరూ ఆసక్తిగా చూశారు.
source:eenadu
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని భారత జాగృతి ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి ఎల్బీస్టేడియంలో కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్సీ కవిత, ఆమె కుమారుడు ఆర్య తదితరులు.
source:eenadu
బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల వార్షికోత్సవం గురువారం సందడిగా జరిగింది. సంప్రదాయ చీరకట్టులో మెరిసిన యువతులు.. జానపద గేయాలకు అనుగుణంగా నృత్యం చేశారు.
source:eenadu
శివరాత్రి వచ్చిందంటే చాలు వివిధ రకాల పండ్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. నగరవాసులకు అవసరమైన పండ్లు ఇప్పటికే మార్కెట్లకు చేరాయి. బాటసింగారం మార్కెట్ వద్ద పండ్ల లోడుతో వచ్చిన లారీలు బారులు తీరాయిలా..
source:eenadu