చిత్రం చెప్పే విశేషాలు..!
(24-02-2023/1)
ఈ కళాకృతి తుక్కు ఇనుముతో తయారు చేసినవి అంటే నమ్మశక్యం కావడం లేదు కదూ.. రామగుండం రైల్వేస్టేషన్‌లో ఒప్పంద కార్మికుడు చిగురు కుమారస్వామి చేతిలో రూపుదిద్దుకున్నదే ఇది.
source:eenadu
హైదరాబాద్ రాయదుర్గంలోని టీ హబ్‌లో గురువారం ‘అభిరుచిని వ్యాపారంగా మార్చుకోండి’అంశంపై ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇండో వెస్టర్న్, సంప్రదాయ దుస్తులు, బ్రైడల్ సీక్వెల్స్‌గా ఫ్యాషన్ దర్శినులు ర్యాంప్ వాక్ చేశారు.
source:eenadu
బొమ్మ గీస్తున్న యువకుడి పేరు మైఖేల్. స్పెయిన్ దేశానికి చెందిన ఇతను ఫైన్ ఆర్ట్ విద్యార్థి. ఆనంద్‌నగర్ కాలనీలో చిరు వ్యాపారుల జీవన చిత్రాన్ని అక్కడే నిలబడి అప్పటికప్పుడే ఇలా గీసేస్తూ ఆకట్టుకుంటున్నాడు.
source:eenadu
అతి వేగంగా ప్రయాణించే వారి వాహనాల నంబర్లను పోలీసులు చిత్రాలు తీసి చలాన్లు పంపుతున్నారు. వీటిని తప్పించుకోవడానికి నంబర్ ప్లేటు కనిపించకుండా హనుమకొండ నక్కలగుట్ట ప్రాంతంలో ఓ వాహనదారుడు తన శిరస్త్రాణాన్ని అడ్డుగా పెట్టాడు.
source:eenadu
రాయదుర్గం హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ (హెచ్‌కేసీ)లోని టీ హబ్ వద్ద లగ్జరీ కార్లు, బైకుల ర్యాలీ ఉత్సాహంగా సాగింది
source:eenadu
కడప నగరం శివారు ఆలంఖాన్‌పల్లె సమీపంలో ఉన్న కేసీ కాలువ పిచ్చిమొక్కలతో నిండిపోయింది. నీటి ప్రవాహానికి అడ్డుగా మారాయి.
source:eenadu
నిర్వహణ లోపాలతో కూడేరు మండలం కొర్రకోడు వద్ద ఉన్న పెన్నహోబిలం జలాశయ గోడలపై పిచ్చిమొక్కలను చాలాకాలంగా తొలగించకుండా వదిలేశారు. నీటి లీకేజీతో గోడలన్నీ చెమ్మగిల్లాయి.
source:eenadu
పంజాబ్‌లో గురువారం పోలీసులపై కర్రలు, తల్వార్‌లతో దాడికి దిగిన అమృత్‌పాల్ అనుచరులు.
source:eenadu