చిత్రం చెప్పే విశేషాలు..!

(25-02-2023/1)

కాలిఫోర్నియాలోని శాంటాక్లారిటాలో హిమపాతం, వర్షపు జల్లుల మధ్య ప్రయాణిస్తున్న వాహనాలు.

Source: Eenadu

ఈమె భారత తొలి మహిళా సోలో సైక్లిస్ట్‌ప్రీతి మస్కే.శ్రీనగర్‌ నుంచి కన్యాకుమారి వరకూ సైకిల్‌పై 3,676 కి.మీ.ప్రయాణాన్ని 11 రోజుల్లో పూర్తిచేసింది.

Source: Eenadu

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ తితిదే వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పాల్గొన్నారు.

Source: Eenadu

హస్తకళలను రూపుదిద్దే క్రమంలో ప్రవాహపు నీటిలో శుద్ధి చేస్తారు. ఈ ఏడాది రబీలో వరి సాగు లేకపోవడంతో కాలువల్లో నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. ఫలితంగా హస్తకళల కళాకారులు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. 

Source: Eenadu

ఇవి సమోసాలు కదా.. పూతరేకులు ఏంటనుకుంటున్నారా? అవును ఇవి పూతరేకులే.. శుక్రవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌లో అలీప్‌ వెకార్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఆత్రేయపురం పూతరేకుల స్టాల్లో వీటిని సమోసా ఆకారంలో తయారు చేసి విక్రయానికి ఉంచారు.

Source: Eenadu

హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ సమీపంలో ఇళ్లు,హోటళ్ల అలంకరణకు వినియోగించే వెదురు వస్తువులను వివిధ రాష్ట్రాలకు చెందిన చిరు వ్యాపారులు తయారు చేసి అమ్ముతున్నారు. 

Source: Eenadu

హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ మూలవిరాట్‌ను శుక్రవారం రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు.పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. 

Source: Eenadu

కరీంనగర్ జిల్లాలోని మానేరు రివర్‌ ఫ్రంట్‌లో రూ. 69 కోట్లతో తీగల వంతెనకు సమీపంలో మానేరు నదిలో ఏర్పాటు చేయనున్న ఈ నమూనాను మంత్రి కమలాకర్‌ ఖరారు చేశారు. 

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

Eenadu.net Home