చిత్రం చెప్పే విశేషాలు..!
(28-02-2023/1)
హైదరాబాద్‌లోని నాగార్జునసాగర్ హైవే మీద తుర్కయాంజాల్ వద్ద ఓ మందుల దుకాణదారు అటుగా వెళ్లేవారు తేలిగ్గా గుర్తుపట్టేలా ఈ భారీ గుళిక ఆకారాన్ని ఏర్పాటు చేశారు. దూరం నుంచి చూసినా ‘‘రెండు సిరంజ్‌లు, క్యాప్సుల్’’ కనిపిస్తున్నాయి.
Source:Eenadu
హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ నుంచి ఖైరతాబాద్ వెళ్లే దారిలో ఉన్న ఓ వృక్షానికి పసుపు పచ్చ పూలు విరగబూయడంతో ఇలా కళకళలాడుతోంది. ఆ మార్గంలో వెళ్తున్న వారిని ఈ పూల సోయగాలు ఆకర్షిస్తున్నాయి.
Source:Eenadu
హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా రహదారులను విస్తరిస్తున్నారు. నిర్మాణ పనులకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి.. నెక్లెస్ రోడ్ సంజీవయ్య పార్క్‌లో భద్రపరుస్తున్నారు.
Source:Eenadu
హైదరాబాద్‌లోని నూతన సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్ నుంచి వస్తున్న నీటి తుంపర్లు ఇవీ..!
Source:Eenadu
ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద సోమవారం భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో నృత్య భంగిమలో విదేశీ యాత్రికులు
Source:Eenadu
ఎండలు ముదురుతున్న క్రమంలో హైదరాబాద్ నగరవాసులు చల్లదనం కోసం స్విమ్మింగ్ పూల్స్ చుట్టూ చేరుతున్నారు. మందమల్లమ్మ గార్డెన్ నుంచి బాలాపూర్ రోడ్డులో ఉన్న ఓ ఈత కొలనులో యువకులు కేరింతలు కొడుతున్నారు.
Source:Eenadu
చిత్రంలోని వృద్ధుడి పేరు సాయిలు. ఊరు ఇబ్రహీంపట్నం. ఈయన భూమి సాంకేతిక సమస్యలతో ధరణి పోర్టల్‌లో తన పేరుపైకి రాకపోవడంతో సోమవారం కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలోనూ వినతిపత్రమిచ్చి వెనుదిరిగాడు.
Source:Eenadu
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ రాజీవ్ సర్కిల్ వద్ద యూటర్న్ లేదని ఏర్పాటు చేసిన సూచిక పక్కనే సర్కిల్ వద్ద టర్నింగ్ తీసుకోవాలనే సూచిక కూడా ఉంది. దీంతో వాహనదారులు సర్కిల్ వరకు వెళ్లి అక్కడ బారికేడ్లు పెట్టి ఉంచడంతో తికమక పడుతున్నారు.
Source:Eenadu