చిత్రం చెప్పే విశేషాలు..!
(04-03-2023/1)
పండగ ఆచారాలు, సంప్రదాయాలు పల్లెల్లో ఇంకా మరవలేదనడానికి నిదర్శనమే చిత్రం. పల్లెల్లో కాముడు ఆట..పాటల సందడి నెలకొంది. భీంపూర్ మండలం అంతర్గాంలో శుక్రవారం ఆ గ్రామమహిళలు ఇలా ఇంటింటికి తిరిగి పాటలు పాడి యజమానులు ఇచ్చే కానుకలను తీసుకున్నారు.
source:eenadu
శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుమలలో శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు స్వామివారు రామావతారంలో విహరిస్తూ సీతా, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేతంగా దర్శనమిచ్చి భక్తులకు కనువిందు చేశారు.
source:eenadu
పశ్చిమ బెంగాల్‌లోని నదియాలో హోలీ వేడుకల్లో పాల్గొన్న మహిళలు
source:eenadu
నల్లకుంట-అడిక్‌మెట్ మార్గంలోని ఓ బస్టాపులో తడకతో షెల్టర్ ఏర్పాటు చేశారు. నలుగురు సైతం పట్టని ఆ తడక నీడలోనే ఎండలో తలదాచుకుంటున్నారు.
source:eenadu
నానక్‌రాంగూడ చౌరస్తాలో ఇటీవల ఇనుప వస్తువులతో రూపొందించిన మనిషి రూపం ఆకట్టుకుంటోంది. ఆ పక్కనే ఉన్న భవనాన్ని, బొమ్మను కలిపి చూస్తే.. దానిపై గీసిన చిత్రంలా కనిపిస్తోంది..
source:eenadu
జీవీఎంసీ ఒకటోవార్డు పరిధి కొండపేటలో పక్కింట్లోని ఆవు ఆ ఇంటి శ్లాబ్ ఎక్కి పక్కనే ఉన్న రేకుల ఇంటిపైకి గురువారం అర్ధరాత్రి దాటాక దూకేసింది. దీంతో రేకులు విరిగి ఆవు ఇంట్లోని మంచం పక్కన పడింది. పెద్ద శబ్దంతో నిద్రలో ఉన్నవారు ఉలిక్కిపడ్డారు.
source:eenadu
విశాఖపట్నం పెట్టుబడిదారుల సదస్సు ప్రాంగణంలో ఫలాలు, కూరగాయలతో చేసిన అలంకరణ ఆహూతులను ఆకట్టుకుంది. గిరిజన సంప్రదాయ నృత్యప్రదర్శనలు అలరించాయి.
source:eenadu
ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు శుక్రవారం బందరుకోటలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు. అంతిమయాత్రలో తెదేపా అధినేత చంద్రబాబుతో సహా ప్రముఖ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అర్జునుడి సతీమణిని చంద్రబాబు ఓదార్చారు.
source:eenadu