చిత్రం చెప్పే విశేషాలు..!
(05-03-2023/1)
నటుడు మంచు మనోజ్ ఆదివారం కర్నూలుకు బయలు దేరారు. వివాహం తర్వాత మొదటిసారి తన సతీమణి భూమా మౌనికా రెడ్డితో కలిసి ఆయన అత్తవారింటికి వెళ్తున్నారు.
source:eenadu
విజయనగరంలో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేశారు. ఒక జ్యూయలరీ షోరూం ప్రారంభానికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
source:eenadu
జీ-20 థీమ్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆర్బీఐ శనివారం ‘జన్ భాగీదరి’ పేరుతో 10కే, 5కే పరుగు నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన నగర సీపీ సీవీ ఆనంద్, ఆర్బీఐ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ కె.నిఖిలతో కలిసి పరుగును ప్రారంభించారు.
source:eenadu
హైదరాబాద్ నగరంలోని ప్రొ. జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో బంతి, మోదుగపూలు, చెట్ల బెరడులు, జాఫ్రానీ గింజలు వంటి ముడిపదార్థాలతో సహజ రంగులు తయారు చేస్తున్నారు. హోలీని రసాయన రంగులతో కాకుండా సహజ వర్ణాలతో జరుపుకోవాలని వర్సిటీ వీటి తయారీని ప్రోత్సహిస్తోంది
source:eenadu
హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్యప్రదర్శన కనువిందుగా శనివారం సాగింది. లయాత్మకంగా నృత్యం చేసి అందరినీ రంజింప జేశారు.
source:eenadu
నిలోఫర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ తల్లి తన బిడ్డను చెట్టు కొమ్మలకు చీరతో చేసిన ఊయలలో పడుకోబెడుతోంది. పక్కనే ఉన్న ఓ కుక్క ఇలా చూస్తూ కనిపించింది.
source:eenadu
పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఆరున్నరేళ్ల చిన్నారి సియెన్నా చోప్రా దక్షిణాఫ్రికాలోని 19వేల అడుగుల ఎత్తున్న కిలిమంజారో, మేరూ పర్వత శిఖరాలను అధిరోహించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు.
source:eenadu
జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీలక్ష్మీనారసింహస్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణోత్సవాన్ని అశేష భక్త జనం మధ్య శనివారం నిర్వహించారు.
source:eenadu