చిత్రం చెప్పే విశేషాలు..!

(07-03-2023/1)

డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండల సముద్రం తీరంలో గచ్చకాయలపోర నుంచి పల్లంశివారు పరిసరాల్లో జనవరి వరకు నీటితో సరస్సును తలపించింది. ఈ పర్ర ప్రస్తుతం ఎడారిలా మారిపోయి, ఇసుక మేటలతో దర్శనమిస్తోంది. 

source:eenadu

ఏ పూల చెట్టుకైనా కొన్ని ఆకులు మరికొన్ని పువ్వులు ఉండటం సహజం, నిలువెల్లా పుష్పాలు కనిపించే చెట్లు అరుదు. పాలకొల్లు నుంచి భీమవరం వెళ్లే బైపాస్‌ రహదారిలో కాగితం పూలచెట్టు మాదిరిగా ఉన్న ఒక చెట్టు నిండుగా విరబూసింది.

source:eenadu

కళ్లు మిరుమిట్లు గొలిపేలా దీపాల కాంతులతో మెరిసిపోతున్న థాయ్‌లాండ్‌లోని పాతుమ్‌ థాని ప్రావిన్స్‌లో ఉన్న బౌద్ధ దేవాలయమిది. మాఘ పూజను పురస్కరించుకుని సోమవారం ఇలా దీపాలతో ఈ కోవెల ప్రాంగణాన్ని అలకరించారు.

source:eenadu

శ్రీకాళహస్తి రాజగోపురం పున్నమి వెన్నెల్లో భక్తులను ఆకట్టుకుంటోంది. సోమవారం రాత్రి ఊంజల్‌ సేవకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజగోపురం అందాన్ని చూసి తన్మయం చెందారు.

source:eenadu

విశాఖపట్నంలోని రామ్మూర్తి పంతులు పేటలో కొలువై ఉన్న శ్రీ పైడిమాంబ అమ్మవారి తొలేళ్ల పండగ సందర్భంగా జగదాంబ కూడలి వద్ద ఊరేగింపు చేశారు.

source:eenadu

హైదరాబాద్‌లోని. ముషీరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తి.. ఆరుగురు చిన్నారులను తన బైక్‌పై ఎక్కించుకొని .. రోడ్డుపై ఎదురుగా వచ్చే ఇతర వాహనాలను తప్పించుకుంటూ అపసవ్య దిశలో ఇలా ప్రమాదకరంగా ప్రయాణించాడు. 

source:eenadu

హైదరాబాద్‌ నగరంలో ఒక రోజు ముందుగానే హోలీ వేడుకలు మొదలయ్యాయి. సోమవారం అబిడ్స్‌ స్టాన్లీ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు, బేగంబజార్‌లో వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో రంగుల పండగను ఘనంగా జరుపుకొన్నారు.

source:eenadu

జమ్మూ-కశ్మీర్‌ లోని సాంబా జిల్లాలో సోమవారం భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద హోలీ సంబరాలు చేసుకుంటున్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(23-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

Eenadu.net Home