చిత్రం చెప్పే విశేషాలు..!
(08-03-2023/1)
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో సందడి చేస్తూ నగరవాసులు ఈత కొలనులో మంగళవారం సేద తీరారు.
Source: Eenadu
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్ ముందు పాత కాలం నాటి కారు బొమ్మ ఏర్పాటు చేసి పూలతో ఇలా అలంకరించారు. సందర్శకులకు ఆ దృశ్యం కనువిందు చేస్తోంది.
Source: Eenadu
ఆకులు రాలి, అనేక చెట్లు మోడువారగా, మోదుగ చెట్టు మాత్రం నిండుగా పూలతో కళకళలాడుతోంది. వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం కేంద్రం నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న ఓ చెట్టు ఇది.
Source: Eenadu
మంచు పర్వతాల్లో గస్తీ విధుల్లో ఉన్న ఈ సైనికాధికారిణి కెప్టెన్ శివ చౌహన్ . ప్రపంచంలో అత్యంత ఎత్తైన రణ క్షేత్రమైన సియాచిన్‌లో విధులు నిర్వర్తిస్తున్న తొలి సైనికాధికారిణిగా ఈమె రికార్డులకు ఎక్కారు.
Source: Eenadu
దిల్లీలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో మంగళవారం రాష్ర్టపతి భవన్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.
Source: Eenadu
ఫ్రాన్స్‌లో ఉద్యోగ విరమణ వయసును 64 ఏళ్లకు పెంచడానికి ఉద్దేశించిన బిల్లును నిరసిస్తూ రాజధాని పారిస్‌లో మంగళవారం ఆందోళనకు దిగిన ఉద్యోగులు, చెత్త ఎత్తే కార్మికులు, యుటిలిటీ వర్కర్లు, రైలు డ్రైవర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు.
Source: Eenadu
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో మంగళవారం హోలీ వేడుకల్లో మహిళల సంబరాలు..
Source: Eenadu
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, హోలీ వేడుకలను నిర్వహించారు. రాష్ర్ట కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు.
Source: Eenadu
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవ ప్రారంభ క్రతువుగా తలంబ్రాలను కలుపుతున్న భక్తులు.
Source: Eenadu