చిత్రం చెప్పే విశేషాలు..!

(14-03-2023/1)

సృష్టిలో విభిన్న రంగుల్లో కనిపించే సీతాకోక చిలుకలు అంటే ఎంతో ఇష్టం. వీటిని ఫోటోలు తీసేందుకు ఆయా సీజన్లలో అరకులోయ, లంబసింగి, చింతపల్లి ప్రాంతాలతోపాటు జలపాతాలు, నదీతీర ప్రాంతాలకు చాలా మంది వెళ్తుంటారు.

source:eenadu

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో శ్రీభవాని మాత ఆలయ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. 

source:eenadu

ఇదేదో క్రోటాన్‌ మొక్క అనుకుంటారు. కానీ ఇది 40 ఏళ్లనాటి రావిచెట్టు. ఖమ్మంలోని గంగారం రామాలయం వద్ద ఉన్న ఈ చెట్టు కొమ్మలు విద్యుత్తు తీగలకు తాకుతుండటంతో వాటి నరికి వేశారు. 

source:eenadu

నల్గొండ జిల్లాలోని అడవిదేవులపల్లి మండలం కేంద్రం నుంచి సోమవారం గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో మిరపకాయలు కోసేందుకు వెళ్లిన కూలీలు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ఆటోలో 25 మంది ఎక్కారు. 

source:eenadu

తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు రహదారుల వెంట ఏర్పాటు చేసిన డబ్బాలు కొందరి బాధ్యతారాహిత్యంతో వృథా అవుతున్నాయి. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌ బస్టాప్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెత్త డబ్బాకు నిప్పు పెట్టడంతో దహనమైంది.

source:eenadu

థాయిలాండ్‌లోని పట్టాయాలో సోమవారం జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విందును ఆరగిస్తున్న గజరాజులు

source:eenadu

ఆఫ్రికాలోని మలావి దేశంలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ధాటికి ఎటు చూసినా నదులు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి.

source:eenadu

సాంకేతికత, ప్రజాప్రయోజనాల కోసం దాని వినియోగం వంటి అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ, నోకియా సీఈఓ పెక్కా లండ్‌మార్క్‌ చర్చించారు. ఈ మేరకు దీనిపై ఇద్దరు ట్విటర్‌ వేదికగా స్పందించారు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home