చిత్రం చెప్పే విశేషాలు..!

(18-03-2023/1)

గుంటూరు జిల్లా రాజధానిలోని సీడ్‌యాక్సెస్‌ రహదారి ఒకవైపు అధ్వానంగా మారింది. వాహనాలు వెళ్తున్నప్పుడు విపరీతంగా దుమ్ము కమ్మేస్తోంది. 

source:eenadu

గుంటూరు జిల్లాలోని ఉండపల్లి కరకట్ట రహదారి ఇరుకుగా మారడంతో విస్తరణ చేపట్టారు. రోడ్డుపై అడ్డుగా ఉన్న నిఘా కెమెరా స్తంభం మాత్రం అలాగే వదిలేశారు.

source:eenadu

ముసలిమడుగు సమీపంలో ఊరికి దూరంగా ఉన్న గిరిజన గురుకుల కళాశాలలో చదువుతున్న ఇంటర్‌ ప్రథమ విద్యార్థులు శుక్రవారం పరీక్ష రాసేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. వర్షం రావడంతో కళాశాల ఆవరణలోనే ఆర్టీసీ బస్సు బురదలో కూరుకుపోయింది. 

source:eenadu

హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్లే లారీలు, భారీ వాహనాలు విజయవాడ ఇన్నర్‌ రింగు రోడ్డు మీదుగా వెళ్తాయి. పాయకాపురం దారిలో రహదారిపై వాటిని డ్రైవర్లు భోజనాలు, అల్పాహారం కోసం నిలిపేస్తున్నారు. దీనితో ట్రాఫిక్‌ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. 

source:eenadu

టిడ్కో ఇళ్ల నిర్మాణం మూడున్నరేళ్లుగా ముందుకు కదలడంలేదు. అనంతపురం జిల్లా పామిడి మండలకేంద్రానికి సమీపంలో జాతీయ రహదారి పక్కన సుమారు 1400 ఇళ్ల భవనాలు కొంతమేర పూర్తవగా చాలావరకు పిల్లర్లు, పునాది దశలోనే ఆగిపోయాయి.

source:eenadu

కళ్ల ముందే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రమాదకరమని తెలిసినా నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్నారు. మెదక్‌లో ప్రధాన రహదారిలో ట్రాక్టర్‌పై ఇలా కూర్చొని వెళ్తున్నారు. 

source:eenadu

హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో కొత్తగా ప్రారంభమైన ఓ స్టోర్‌లో యువ కథానాయికలు సందడి చేశారు. శ్రీలేఖ, రితిక చక్రబర్తి, కృతిక రాయ్, నిషాత్‌ షేక్‌ తదితరులు సంప్రదాయ, డిజైనర్‌ వస్త్రాలు ధరించి సందడి చేశారు.

source:eenadu

వాతావరణం చల్లబడి, చిరుజల్లులు కురుస్తుండటంతో శుక్రవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ ఉద్యానవనంలో ఓ నెమలి ఇలా పురివిప్పి కనువిందు చేసింది.

source:eenadu

ఒలింపిక్‌ జ్యోతి వెలిగింది..!

యాడ్‌లో ఈ అందాన్ని చూశారా!

డార్లింగ్ డైలాగ్స్‌తో నభా..

Eenadu.net Home