చిత్రం చెప్పే విశేషాలు..!

(19-03-2023/1)

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి ఇది. అమరావతిలోని తాళ్లాయపాలెం నుంచి మందడం వరకు గుంతలమయంగా మారింది.

source:eenadu

విశాఖలోని చింతూరు మార్గంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ నెమలికాయల చెట్టు కాయలు ఆకులుగా..పెదార్కూరు సమీపంలోని అడవిలో రహదారి పక్కనే ఎర్రని పూల మాదిరిగా చెట్టు ఆకులు..!

source:eenadu

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని విద్యానగర్‌ హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ ఆళ్లగడ్డ చెరువు గుర్రపు డెక్కతో నిండిపోయింది. చెరువులోని చేపలు పట్టుకోవడానికి వీల్లేకుండా తయారైంది.

source:eenadu

హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో ఓ భవనం బాల్కనీలో పడిన వడగళ్లు

source:eenadu

కొల్లేరులో నీటిమట్టం తగ్గడంతో వందల కొంగలు చిన్న చేపలను పట్టి ఆరగిస్తున్నాయి. అంతలోనే ఎగురుతూ అక్కడి ప్రకృతి అందాలకు మరింత వన్నెలు దిద్దుతున్నాయి. 

source:eenadu

ఆకులను తలపిస్తున్న ఈ మొక్కల పేరు హోయా. సర్క్యులెంట్స్‌ జాతికి చెందిన ఈ మొక్కలను థాయ్‌లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఆకులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు ఆక్సిజన్‌ విడుదల చేస్తుంది.

source:eenadu

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ జిల్లాలో బావికి, తోటకి పెళ్లి చేశారు. గ్రామస్థులను ఆహ్వానించారు. కైసర్‌గంజ్‌ ప్రాంతంలోని కద్‌సర్‌ బితౌరా గ్రామంలో ఉంది.

source:eenadu

లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. కిలోమీటర్ల మేర నదిలో ఎక్కడ చూసినా నిర్జీవంగా తేలియాడుతోన్న చేపల దృశ్యాలే. ఆస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌లోని మెనిండీ సమీపం డార్లింగ్‌ నదిలో ఈ పరిస్థితి నెలకొంది.

source:eenadu

చిత్రం చెప్పే విశేషాలు..!(20-03-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(19-03-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(18-03-2023/2)

Eenadu.net Home