చిత్రం చెప్పే విశేషాలు..!
(21-03-2023/1)
ఓ కోతికి దాహం వేసింది.. అటు ఇటు చూసింది.. ఓ బోర్డు వద్దకు చేరింది.. తాగునీటికి దారిని చూసుకుని దాహం తీర్చుకుంది.. ఇది యాదాద్రిలో సోమవారం కనిపించింది.
source:eenadu
ఉగాది నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు ఆరంభం కానుండడంతో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కోవెల పరిసరాలు కల్యాణానికి ముస్తాబవుతున్నాయి. ఆలయానికి విద్యుత్తు దీపాలను అలంకరించారు.
source:eenadu
తిరుపతి జిల్లా వడమాలపేట, ఏర్పేడు మండలాల పరిధిలోని సదాశివకోనలో పురాతన శిలాశాసనం సోమవారం లభ్యమైంది. ఇది తెలుగులో శాఖయుగం 147(6) ఆనంద, శ్రావణ, భ 10, మంగళవారం= 1554 సీఈ ఆగస్టు 22న చెక్కనట్టుఉంది.
source:eenadu
అనంతపురం జిల్లాలోని కదిరి నుంచి గొడ్డవెలగల గ్రామానికి, తలుపుల మండలం పరిధిలోని గ్రామాలకు వెళ్లే రహదారిలో మారన్నకుంట మరువ వంతెన రక్షణ గోడ కూలిపోయింది.
source:eenadu
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలో రైతు పాండు నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవలి కాలంలో అతడి బోరుబావి ఇంకిపోవడంతో వరిని గడ్డి కోసం కోస్తున్నాడు.
source:eenadu
తీవ్రజ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఓపీ కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు.
source:eenadu
దిల్లీలోని బుద్ధ జయంతి పార్కులో అల్పాహారం తీసుకుంటున్న మోదీ, కిషిద
source:eenadu
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం, మసివాగు, పోచారం, బోయితండా, మాణిక్యారం పంచాయతీల పరిధిలో సోమవారం ఉదయం వరకు వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.
source:eenadu