చిత్రం చెప్పే విశేషాలు..!

(22-03-2023/1)

అవును.. ఈ మొక్క ధర చూస్తే ‘మొక్కే బంగారమాయే’ అనిపిస్తుంది. దాని పూలు మాత్రం బంగారు వర్ణంలో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గోల్డ్‌ చైన్‌గా పిలిచే ఈ మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో కనిపించాయి.

Source. Eenadu.

 ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని అమీర్‌ కుమ్మరి బస్తీలో కొత్త కుండను పరిశీలిస్తున్న యువతి. 

Source. Eenadu

తెలుగు సంవత్సరంలో మొదటి పండుగ ఉగాది. ఈ రోజు షడ్రుచులతో చేసిన పచ్చడి తినడం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం. శోభకృత్‌ నామ సంవత్సరానికి మనసారా స్వాగతం పలుకుతున్నారు.

Source. Eenadu

తెలుగు సంవత్సరాది సందర్భంగా చేసే ఉగాది పచ్చడికి జిల్లాలో ఈసారి వేప పువ్వు కరవయింది. ఉగాది నాటికి ఆకులన్నీ రాలి కొత్త చిగుళ్లు వచ్చి, నిండుగా పూత పూయాల్సిన వేపచెట్లు వైరస్ కారణంగా ఎండిపోయి కనిపిస్తున్నాయి.

Source. Eenadu

చెట్ల కొమ్మలు తొలగించినా.. మొదలు భాగంలో గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాశాయి. ఏపీలోని శ్రీసత్యసాయిజిల్లా తాడిమర్రి మండలంలోని చిల్లవారిపల్లి గ్రామంలో సురేశ్‌ మామిడి తోటలో చెట్లు బాగా పెరగాలని గత ఏడాది కొమ్మలను నరికివేయించారు.

Source. Eenadu

ఉగాది పండుగ సందర్భంగా పట్టణాల్లో, గ్రామాల్లో ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించడం ఆనవాయితీ, పోచమ్మ, దుర్గమ్మ, మైసమ్మ ఆలయాల చుట్టూ తిప్పుతుంటారు. 

Source. Eenadu

గాజుంకొల్లివలసలోని సంగమేశ్వరస్వామి కొండ వద్ద శిల్పి గేదెల హరికృష్ణ రూపొందించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. శోభకృత్‌ నామ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 

Source. Eenadu

తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకకు సిద్ధమైంది భాగ్యనగరం. షడ్రుచుల పచ్చడి.. సంప్రదాయ వస్త్రధారణతో మార్కెట్లు కిటకిటలాడాయి. 

Source. Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (17-04-2024/1)

అమలాపాల్‌ సీమంతం..

ఇంత అందంగా ఉంటే ఎలా మేడమ్‌..

Eenadu.net Home