చిత్రం చెప్పే విశేషాలు..!
(23-03-2023/1)
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారీ అంబేడ్కర్ విగ్రహం దాదాపు పూర్తికావొచ్చింది. తలభాగం, కళ్లజోడు ఏర్పాటు చేస్తే విగ్రహం పూర్తయినట్లే..
Source: Eenadu
బండపై బండ పేర్చినట్టుగా అందంగా కనిపిస్తున్న ఈ చిత్రం శంషాబాద్ హమీదుల్లానగర్‌లోది. చూడటానికి ఆహ్లాదంగా కనిపిస్తుండటంతో చాలా మంది సందర్శిస్తున్నారు.
Source: Eenadu
గుడిపడ్వా సందర్భంగా నగరంలోని మహారాష్ట్ర వాసులు హైదరాబాద్‌లోని చార్మినార్ నుంచి సైబర్‌టవర్స్ మీదుగా సీసీఆర్‌టీ వరకు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.
Source: Eenadu
వర్షాకాలంలో ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వలోకి నీరు చేరుకుంది. నీరు ఎటూ పోయే పరిస్థితి లేకపోవటంతో మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు ప్రధాన కాల్వలో పచ్చటి తివాచీ పరిచినట్లు చూపరులను ఆకట్టుకుంటోంది.
Source: Eenadu
పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు వెళితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకునే వారు కరవయ్యారు. బాపట్ల జిల్లాలోని వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలో మినీ వ్యానులో ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.
Source: Eenadu
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కోర్కోరాన్‌లో వరదలతో నీట మునిగిన కార్లు
Source: Eenadu
ఖమ్మం జిల్లా సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల విభాగంలోని ముస్కాన్ కేంద్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పడకల మధ్యలో, నడిచే దారిలో రంగులతో ఏబీసీడీలు, తెలుగు అక్షరమాల రాయించారు.
Source: Eenadu
ముంబయిలో నిర్వహించిన మరాఠీ నూతన సంవత్సర సంబరాలైన ‘గుడి పడ్వా’లో పాల్గొన్న ప్రజలు
Source: Eenadu