చిత్రం చెప్పే విశేషాలు..!

(25-03-2023/1)

చిత్తూరు జిల్లాలోని గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన పురుషోత్తం సినీ నటుడు రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్లాస్టిక్‌ బాటిళ్లపై ప్రత్యేక చిత్రాన్ని రూపొందించారు.

source:eenadu

సినిమా కథలో మలుపుల మాదిరి సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వాతావరణం ఒక్కోరకంగా ఉంది. రాకపోకలు సాగించేవారికి ప్రతి పూటా కొత్త అనుభూతిని మిగిల్చింది.

source:eenadu

ఇవి అరుదుగా కనిపించే గురువింద గింజలు. పూర్వం కంసాలి వృత్తి చేసే వారు గురువింద గింజల్ని బంగారం తూకం వేయడానికి ఉపయోగించేవారు. ఈ మొక్క హనుమకొండ జిల్లా కోమటిపల్లిలోని నిరూప్‌నగర్‌లో కనిపించింది.

source:eenadu

విశాఖ నగరంలో సినీతారల సందడి అభిమానులను అలరించింది. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ పోటీలలో పాల్గొన్న పలు భాషల నటులు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. 

source:eenadu

కాకినాడ సముద్రతీరంలో మత్స్యకారులకు శుక్రవారం 16 కిలోల బరువైన చేప దొరికింది. స్థానికంగా దీన్ని పులిటేకు చేపగా పిలుస్తారు.

source:eenadu

నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమ ప్రదేశాన్ని సందర్శించేందుకు భక్తులు తరలొస్తుంటారు. ఈ దారి మధ్యలో ఉన్న వారధిపై గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చి రాకపోకలు నిలిచిపోయాయి.

source:eenadu

యాదాద్రిలోని కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని లక్ష్మీపుష్కరిణి చెంత నీడనిచ్చే వసతుల్లేక భక్తజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల దాటిందంటే భానుడి ప్రభావం వల్ల పుణ్యస్నానమాచరించలేక పోతున్నారు. 

source:eenadu

పుట్టలు సాధారణంగా 3 నుంచి 4 అడుగుల ఎత్తు ఉంటాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మత్య్సపురం పంచాయతీ బంగారుమెట్ట గ్రామ సమీపంలో సుమారు 15 అడుగుల ఎత్తు పుట్ట పెరిగింది. 

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home