చిత్రం చెప్పే విశేషాలు..!
(26-03-2023/1)
హుషారైన పాటలు...ఉర్రూతలూగించే నృత్యాలు.. కుర్రకారు కేరింతలతో విజయనగరంలోని డెంకాడలోని లెండి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సందడి నెలకొంది.
source:eenadu
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భాజపా ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాచేపట్టారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ కాషాయ జెండాలు, ప్లకార్డులతో ఆందోళనలో పాల్గొన్నారు.
source:eenadu
హైదరాబాద్‌లోని హయత్‌నగర్ కుమ్మరికుంట చెరువు పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైంది. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలోని జలాశయంలో పెద్ద పెద్ద భవంతులు వెలిశాయి.
source:eenadu
అత్యవసర చికిత్సకు హైదరాబాద్‌లోని నిమ్స్, నిలోఫర్ ఆసుపత్రులకు వచ్చేవారికి అవస్థలు తప్పడం లేదు. చక్రాల కుర్చీలు, స్ట్రెచర్లు లేకపోవడంతో చేతులపైనే ఎత్తుకెళ్లాల్సి వస్తోంది.
source:eenadu
దిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయం ఇది. ఎర్త్ అవర్ సందర్భంగా శనివారం రాత్రి విద్యుద్దీపాలు ఆర్పివేయడంతో ఇలా చీకట్లు అలముకున్నాయి
source:eenadu
భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులై శ్వేతసౌధంలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుమార్తె మాయాతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఎరిక్ గార్సెట్టి..
source:eenadu
ప్రధాని మోదీ శనివారం కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్-కేఆర్‌పుర మధ్య మెట్రో రైలును ప్రారంభించారు. అందులో ప్రయాణిస్తూ విద్యార్థులతో మాట్లాడారు
source:eenadu
జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భారత తొలి కేబుల్ ఆధారిత రైల్వే వంతెన ఇది. కట్రా - బనిహాల్ రైల్వే మార్గంలో చుట్టూ కొండలు, లోయల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి.
source:eenadu