చిత్రం చెప్పే విశేషాలు..!

01-04-2023/1)

సింహగిరిపై అప్పన్న స్వామి రథోత్సవం, కల్యాణోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సింహాచల క్షేత్రాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.

source:eenadu

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మన్యం బంద్‌ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విద్యార్థులంతా పుస్తకాలకు టాటా చెప్పి ద్విచక్రవాహనంపై ఇలా పొలానికి బయలుదేరి వెళ్తున్నారు. 

source:eenadu

ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు ప్రయాణించడమే కొంత కష్టం. అలాంటిది వాహనం చుట్టూ మిరప బస్తాలు... దానిపైనా మరో వ్యక్తి కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల సమీపంలో తీసిన చిత్రం.

source:eenadu

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ మీదుగా వెళ్లే వరంగల్‌ జాతీయ రహదారి హరిత శోభతో ఆకట్టుకుంటోంది. రోడ్డు మధ్యలోని విభాగినిలో నాటిన పూలమొక్కలు ఏపుగా పెరిగాయి.

source:eenadu

సినీనటి ప్రగ్యా జైస్వాల్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆమె సరికొత్త డిజైన్ల ఆభరణాలు ధరించి హొయలు పోయారు.

source:eenadu

ప్రముఖ నృత్య కళాకారుడు, కళా నిపుణుడు ఆనంద శంకర్‌ జయంత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సీసీఆర్‌టీలో రామాయణ కల్పవృక్షం సాంస్కృతికోత్సవాన్ని నిర్వహించారు. 

source:eenadu

హైదరాబాద్‌ నగరంలోని జూపార్కు సమీపంలో ఉన్న మ్యూజియంలో.. హెల్మెట్, క్రికెట్‌ బ్యాట్, డైనింగ్‌ టేబుల్, డబుల్‌ డెక్కర్‌.. తదితర ఆకృతుల్లో తయారుచేసిన వాహనాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. 

source:eenadu

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాఠశాల ఆవరణలో ఒలింపిక్‌ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈత కొలనును శుక్రవారం ప్రారంభించారు. కజకిస్థాన్‌ నుంచి వచ్చిన ‘కజక్‌ సింక్రో స్టార్స్‌’ ఈత బృందం ప్రదర్శించిన అద్భుత విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

source:eenadu

చిత్రం చెప్పే విశేషాలు(29-03-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు(29-03-2024/1)

చిత్రం చెప్పే విశేషాలు(28-03-2024/2)

Eenadu.net Home