చిత్రం చెప్పే విశేషాలు..!
(02-04-2023/1)
రహదారి నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వాడ్యాల శివారులో ట్రాక్టరు ఇంజిన్ వెనుక భాగంలో మహిళలు ప్రమాదకరంగా కూర్చుని వెళ్తున్న దృశ్యమిది.
source:eenadu
నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం నుంచి టోకెన్ పద్ధతి అమలు చేస్తున్నారు. రోజు ఇక్కడికి 500 మంది వరకు వస్తున్నారు. ఆచూకీ విభాగంలో కేవలం 50 మంది మాత్రమే చదువుకునేందుకు వీలుంది.
source:eenadu
మన్యం ప్రాంతమంతా పచ్చని చెట్లతోనూ. రంగురంగుల పుష్పాలతో పులకింపజేస్తోంది. అల్లూరి సీతారామ రాజు జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ నుంచి కొండపై నున్న అనంతగిరి వరకు మార్గమధ్యంలో ప్రకృతి సంపద సందర్శకుల్ని రా రమ్మని ఆహ్వానిస్తున్నట్లుంది.
source:eenadu
చిలుక జాతి గువ్వల సవ్వడి ఆ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తోంది. మైసూరుకు సమీపంలోని కావేరి తీరంలో ఇపుడిలాంటి పక్షుల సవ్వడి అంతా ఇంతా కాదు. వీటిని చూడటానికి జనం ఆసక్తి చూపుతున్నారు.
source:eenadu
నల్గొండ జిల్లాకేంద్రం మిర్యాలగూడ రోడ్‌లో గొల్లగూడ వద్ద గల నీలగిరి నందనవనం పార్కులో గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా కళారూపాలు ఏర్పాటు చేశారు. కళారూపాల నిర్వహణను పట్టించుకోకపోవడంతో అవి కళ తప్పాయి.
source:eenadu
తూర్పుగోదావరి జిల్లాలో రబీ సీజన్లో వేసిన మొక్కజొన్న చేతికందొచ్చింది. సీతానగరం మండలం వంగలపూడి శ్మశానవాటికలోని సమాధుల మధ్యలోనే మొక్కజొన్న ఆరబెట్టుకుని అక్కడే రైతులు పడుకుంటున్నారు.
source:eenadu
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిలకించి తరించిన భక్తకోటికి శనివారం నిర్వహించిన రథోత్సవం కనులపండువగా ఉంది.
source:eenadu
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. source:eenadu