చిత్రం చెప్పే విశేషాలు..!
(16-04-2023/1)
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. విజయవాడలో ఒంటిపూట బడుల నుంచి చిన్నారులు ఇంటికి వెళ్లేసమయంలో మండుటెండలో తల్లడిల్లుతున్నారు.
source:eenadu
జేసీబీ వాహనం ముందు ఉన్న తొట్టిలో ద్విచక్ర వాహనం వేసి తీసుకెళ్లడమే కాదు.. దానిలో ఇద్దరు నిల్చొని మరీ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇది విజయవాడ - గుంటూరు జాతీయ రహదారిపై చినకాకాని వద్ద సర్వీసు రోడ్డులో కనిపించిన దృశ్యమిది.
source:eenadu
విశాఖ జిల్లా జీకేవీధి మండలం రింతాడ పంచాయతీ దుచ్చరిపాలెం వాసులకు తాగునీరు కావాలంటే మైళ్ల దూరం నడవాల్సిందే. ఎట్టకేలకు సత్యసాయి ట్రస్టు చొరవతో నీటి పథకం ఏర్పాటైంది. 666 చీరలతో పందిరి, నీళ్ల బిందెలతో తోరణం ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
source:eenadu
నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు జోరందుకున్నాయి. కొందరు ప్రైవేటు వ్యాపారులు పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ‘క్వింటాలుకు రూ.1950 చెల్లిస్తున్నారని.. 15 రోజుల్లోగా డబ్బులు అందిస్తున్నారని’ రైతులు తెలిపారు.
source:eenadu
కృష్ణా తీరం కోతకొచ్చిన నువ్వుల పంటతో కనువిందు చేస్తోంది. గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల వద్ద కృష్ణాతీరంలో శ్రమైక జీవన సౌందర్యం ఉట్టిపడుతున్న దృశ్యాలివి.
source:eenadu
నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని చాలా చెరువులు మండుటెండల్లోనూ నిండుకుండను తలపిస్తున్నాయి. రామాజీపేట చెరువు ఇలా కనిపిస్తూ కనువిందు చేస్తోంది
source:eenadu
వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లోని సెయిలింగ్ క్లబ్‌లో కయాకింగ్, కనోయింగ్, రెగెట్టా తదితర పడవ పోటీల్లో కూడా శిక్షణ అందిస్తున్నారు.
source:eenadu
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లోని ఓ హోటల్లో శనివారం జరిగిన ఆభరణాల ప్రదర్శనలో సంజయ్‌జోషి కిలో బంగారు నగలు ధరించి ఆకట్టుకున్నారు.
source:eenadu