చిత్రం చెప్పే విశేషాలు..!
(20-04-2023/1)
ఏ పనిచేసినా కాస్త భిన్నంగా, అందరినీ ఆకట్టుకొనే విధంగా ఉండాలని విశాఖలోని ఓ దుకాణ నిర్వాహకులు వాహన భాగాలతో రూపొందించిన ఫర్నీచర్ ముచ్చటగొలుపుతోంది.
source:eenadu
అమెరికా.. లాస్ ఏంజెలెస్‌లోని యూసీఎల్‌ఏ శామ్యూలి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మానవ రూపంలో తయారు చేసిన రోబోతో ఏరోస్సేస్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డెన్సీస్ హాంగ్
source:eenadu
విశాఖలో చాలా చోట్ల సీఎన్‌జీ గ్యాస్ బంకుల్లో నోస్టాక్ బోర్డు కనిపిస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఫైనాన్షియల్ జిల్లా ప్రాంతంలోని ఓ బంకు వద్ద సీఎన్‌జీ కోసం బారులు తీరిన కార్లు
source:eenadu
రంజాన్ మాసంలో సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించేందుకు మసీదుల్లో పండ్లు పంపిణీ చేసేవారు. అనంతరం ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసేవారు. ప్రస్తుత పరిస్థితులు, పనివేళలకు తగ్గట్లు ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. దాంతో పలు మసీదుల్లో ఇలా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారు.
source:eenadu
హైదరాబాద్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఆవరణలోని అరుగులపై పుస్తకాలతో, ల్యాప్‌టాప్‌లతో సాధన చేస్తున్న వీరంతా ఈసెట్, కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు.
source:eenadu
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికా కాన్సులేట్ నూతన కార్యాలయం ప్రత్యేక సొబగులతో ఆకట్టుకుంటోంది. అడుగడుగునా అత్యాధునికతను సంతరించుకుంది.
source:eenadu
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’. మిర్నా మేనన్ కథానాయిక. ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
source:eenadu
నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
source:eenadu