చిత్రం చెప్పే విశేషాలు..!

(24-05-2023/1)

ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో పైవంతెన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దారిలో ఒకవైపు మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి.

source:eenadu

నిజామాబాద్‌ నగరం వినాయక్‌నగర్‌ డివిజన్‌లోని తూర్పు చంద్రిగిరికాలనీలో ప్రధాన రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారైంది. భూగర్భ డ్రైనేజీ కోసం గత ఏడాది తవ్విన గుంతను అధికారులు నాసిరకం తారు వేసి అతుకులతో మమ అనిపించారు. మళ్లీ గుంతలు పడ్డాయి.

source:eenadu

మాదాపూర్‌లోని హైటెక్స్, నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణంలో 30 ఏళ్లుగా ఉన్న ఓ భారీ వృక్షం ఇటీవల కురిసిన వర్షానికి నేలకొరిగింది. స్థానికులు, వాటా ఫౌండేషన్, నోవాటెల్‌ యాజమాన్యంతో కలిసి గుంతను తీసి నేలకొరిగిన వృక్షాన్ని నిలపెట్టారు. 

source:eenadu

భార్యాభర్తల అనురాగానికి నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. ఇతరులపై ఆధారపడకుండా, ఒకరికి ఒకరు తోడుగా సంగారెడ్డి ఇంద్రకాలనీలో మాణిక్‌రెడ్డి, అమృత దంపతులు తమ పనులు తామే చేసుకుంటున్నారు. 

source:eenadu

విజయవాడ గుణదలలోని విద్యుత్తుసౌధ వద్ద వాహనాల పార్కింగ్‌ స్టాండు ఇది. ఆ షెడ్డుపై కూడా సోలార్‌ ప్యానళ్లు అమర్చి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.

source:eenadu

విజయనగరం: ఉత్తరాంధ్రుల కల్పవల్లి పైడితల్లి మంగళవారం బూరెల నైవేద్యం, పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పంచామృతాభిషేకాలు జరిగాయి. ధర్మపురిలో వేంచేసిఉన్న పైడితల్లి అమ్మవారి చల్లదనం మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 

source:eenadu

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం దురదపాడుకు చెందిన సున్నం నాగులు అనే గిరిజన రైతు రెండు ఎకరాల్లో జీడిమామిడి మొక్కలను నాటారు. ప్రస్తుత వేసవి తీవ్రతకు అవి ఎండిపోకుండా ఇదిగో ఇలా మొక్కల చుట్టూ రక్షణగా చీరలను ఏర్పాటు చేశారు.

source:eenadu

సిడ్నీలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినేందుకు భారీగా తరలివచ్చిన ప్రవాస భారతీయులు

source:eenadu

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home