చిత్రం చెప్పే విశేషాలు..!

(26-05-2023/1)

సాగర్‌నగర్‌ బీచ్‌ పరిసరాల్లో సముద్రం గురువారం కొంత మేర వెనక్కి మళ్లడంతో పచ్చదనం వెల్లివిరిసేలా.. హరిత శోభ ఉట్టిపడే రీతిలో పలు ఆకృతుల రాళ్లు బయటపడ్డాయి. 

Source: Eenadu

మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ ఉపయోగించిన 18వ శతాబ్దం నాటి ఈ ఖడ్గం వేలంలో సుమారు 14 మిలియన్‌ పౌండ్లు(రూ.144 కోట్లు) పలికింది. లండన్‌లోని బోన్హమ్స్‌ యాక్షన్‌ హౌస్‌ ఈ నెల 23న దీన్ని వేలం వేసింది.

Source: Eenadu

వచ్చే నెలలో దేశవ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు సన్నాహాకంగా శనివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే వేడుకలకు నగరంలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రాజ్‌భవన్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.

Source: Eenadu

హైదరాబాద్‌లోని నల్లగండ్ల నుంచి వట్టినాగులపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డు ఇది. పనులు జరుగుతున్న సమయంలో దుమ్ము రేగకుండా నీళ్లు చల్లాల్సి ఉండగా.. గుత్తేదారు పట్టించుకోకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

Source: Eenadu

హైదరాబాద్‌ నగర సుందరీకరణలో భాగంగా నార్సింగి కూడలిలో సర్వీసు రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. అక్కడి రాతి గుట్టపై కొత్తగా కళాకృతులు ఏర్పాటు చేస్తున్నారు. చెట్టు నీడన ఓ మనిషి కూర్చున్నట్లు అనిపించేలా ఏర్పాటు చేసిన ఓ శిలా రూపం ఆకట్టుకుంటోంది.

Source: Eenadu

కోతులు రోజూ కల్లులొట్లు పగలకొట్టడంతో వాటి బారినుంచి ఎలాగైనా బయటపడాలని చెట్టుచుట్టూ కర్రలు నాటి వల ఏర్పాటు చేశాడు. నల్గొండ జిల్లా నూతనకల్‌ మండలం తాళ్లసింగారం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బిక్కి కాటమయ్య.

Source: Eenadu

మిషన్‌ భగీరథ పైపులు వేసే క్రమంలో నాణ్యత పాటించకపోవడంతో తరచూ లీకేజీలతో రక్షితనీరు వృథా అవుతోంది. కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్‌ చౌరస్తా సమీపంలో గురువారం ఇందల్‌వాయి-ధర్పల్లి ప్రధాన రహదారి పక్కన వాల్వు ఎగిరిపోవడంతో నీరు పైకి ఉవ్వెత్తున ఎగజిమ్మింది.

Source: Eenadu

ఈనెల 29న షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక రెండో ప్రయోగ వేదికపైకి చేరింది. తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌(వీఎస్‌ఎస్‌సీ) శాస్త్రవేత్తల ఆధ్వర్యాన వాహకనౌకకు నాలుగు రోజులుగా వివిధ పరీక్షలు నిర్వహించారు.

Source: Eenadu

భారత నౌకాదళం అద్భుత ఘనత సాధించింది. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌకపై మిగ్‌-29కే యుద్ధ విమానాన్ని రాత్రిపూట విజయవంతంగా దింపింది. ఈ ప్రక్రియను ‘చరిత్రాత్మక మైలురాయి’గా పేర్కొంది.

Source: Eenadu

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లక్స్‌హ్యాట్చీలోని మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ స్మగ్లర్‌ 29 చిలుక గుడ్లను తరలిస్తూ అధికారులకు దొరికిపోయాడు. 

Source: Eenadu

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home