చిత్రం చెప్పే విశేషాలు..!

(28-05-2023/1)

హైదరాబాద్‌లోని మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా, ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం పరేడ్‌ మైదానంలో నిర్వహించిన యోగా మహోత్సవ్‌ 25 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమం పండగలా సాగింది.

source:eenadu

హైదరాబాద్‌లోని తూర్పు ఆనంద్‌బాగ్‌ కమ్యూనిటీ హాల్‌ సమీపంలోని కరెంట్‌ వైర్లపై తీగ జాతి మొక్క ప్రమాదకరంగా పాకుతోంది. సరఫరాకు అంతరాయంతో పాటు ప్రమాదం సంభవించే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

source:eenadu

ఉప్పల్‌లోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శనివారం హిమగిరి కూచిపూడి నృత్య అకాడమీ గురువర్యులు సూర్యప్రకాష్‌ శిష్య బృందం ‘కూచిపూడి నృత్య విభావరి’ ఆకట్టుకుంది.

source:eenadu

మునుగోడు మండల కేంద్రంలో హరితహారంలో భాగంగా దారిపొడవునా మొక్కలు నాటారు. ఈ ఎండాకాలంలో మొక్కల రక్షణ కోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి చెట్టుకు నీటి సీసాను కట్టి, రంధ్రాలు చేసి చెట్టుకు వేలాడదీశారు. 

source:eenadu

దిల్లీలో శనివారం నెహ్రూ సమాధి వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. 

source:eenadu

పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన పట్నాయక్‌ వేసిన సైకత చిత్రం ఆకట్టుకుంది.

source:eenadu

సామర్లకోట కాలువలో గుర్రపుడెక్క, తూడు పెరిగి నీటి పారుదలకు అడ్డంకిగా మారింది. ఈ నీరు ధవళేశ్వరం నుంచి పిఠాపురం బ్రాంచి కెనాల్‌లో తూటికాడ పెరిగిపోయింది.

source:eenadu

విశాఖ మహా నగరంలో ప్రజలకు అన్ని వేళలా ఉపయోగడాలన్న లక్ష్యంతో పలు కూడళ్లలో ‘అత్యవసర కాల్‌ బాక్స్‌’లు ఏర్పాటు చేశారు. ‘స్మార్ట్‌సిటీ’లో భాగంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ బాక్స్‌ల ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. 

source:eenadu

రాజమండ్రిలో జరుగుతున్న తెదేపా మహానాడులో చంద్రబాబు, అచ్చెన్నాయుడు

source:eenadu

చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024/1)

ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అంటే..

సత్యభామ వచ్చేస్తోంది..

Eenadu.net Home