చిత్రం చెప్పే విశేషాలు...!

(19-09-2023/1)

వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో గణపతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో వినాయకులు కొలువుదీరారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ పూజల్లో పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో గణపతి పూజల్లో కలెక్టర్‌తో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో వినాయకుడి పూజల్లో సీఎం కేసీఆర్‌ సతీ సమేతంగా పాల్గొన్నారు.

కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్లలోని బాల గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి.

విశాఖపట్నం దొండపర్తి రామాలయం వీధిలో 108 అడుగుల భారీ గణనాథుడి విగ్రహం ఆకట్టుకుంది.

హైదరాబాద్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘రాక్‌ స్టార్జ్‌’ అనే లైవ్‌ కాన్సెర్ట్‌ను నిర్వహించారు. నిర్వాహకులు మోడల్స్‌తో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మోడల్స్‌ ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

తెలుగు సినీ రంగంలోనూ చవితి పండగ సందడి నెలకొంది. కొత్త పోస్టర్లను చిత్రబృందాలు విడుదల చేశాయి. ఆదికేశవ పోస్టర్లను సినీ బృందం విడుదల చేసింది.

వినాయక చవితి నేపథ్యంలో ఎక్సట్రా సినిమా హీరో నితిన్‌ చిత్రంతో పోస్టర్‌ను విడుదల చేశారు.

చిత్రం చెప్పే విశేషాలు.. (28-09-2023/1)

కొత్త విషయాలు తెలుసుకోవచ్చు..

చిత్రం చెప్పే విశేషాలు..!(27-09-2023/2)

Eenadu.net Home