చిత్రం చెప్పే విశేషాలు..!
(28-01-2023/2)
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్ పాల్గొని నూతన డిజైన్ల ఆభరణాలు, దుస్తులతో ఫొటోలకు పోజులిచ్చారు.
source:EENADU
కాంగ్రెస్ చేపట్టిన భారత్‌జోడో యాత్ర కశ్మీర్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన అమర జవాన్లకు రాహుల్‌గాంధీ నివాళి అర్పించారు.
source:EENADU
రథసప్తమి సందర్భంగా శనివారం తిరుమలలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహించారు. వరాహస్వామివారి ఆలయ సమీపంలోని పుష్కరిణిలో స్వామివారి విగ్రహానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేశారు.
source:EENADU
రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
source:EENADU
సుహాస్ హీరోగా షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. టీనా శిల్పారాజ్ కథానాయిక. ఫిబ్రవరి 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయవాడలో పర్యటిస్తున్న సుహాస్.. కాలనీవాసులతో ఆడిపాడారు.
source:EENADU
ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయాధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు.
source:EENADU
సినీ దర్శకుడు శైలేష్ కొలను డుకాటి ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆయన... ‘న్యూ ఇయర్.. న్యూ లవ్’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
source:EENADU
కేస్లాపూర్ నాగోబా ఆలయం చుట్టూ భక్తులు నాణేలను గోడలకు అంటించారు. పంటలు బాగా పండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ దేవుడికి ముడుపు కట్టి ఇలా నాణేలను గోడలపై నిల్చొబెట్టారు.
source:EENADU