చిత్రం చెప్పే విశేషాలు..!

(12-02-2023/2)

రెండు మెట్రో రైళ్లు ఎదురెదురుగా ఒకే ట్రాక్‌పై వస్తున్నట్లుంది కదూ! కానీ నిజానికి రెండు రైళ్లు వేర్వేరు దారుల్లో వెళ్తున్నాయి. ఖైరతాబాద్‌లోని ఓ భవనంపై నుంచి చూసినప్పుడు ఇలా కనిపించింది.

source:eenadu

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నటీమణి శ్రీసత్య హాజరై నూతన డిజైన్ల దుస్తులు, ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు.

source:eenadu

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ పూరి స్వామివారిని దర్శించుకున్నారు

source:eenadu

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులైన ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

source:eenadu

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ‘అదుర్స్‌’ సినిమా 2010లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను మార్చి 4న రీరిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. 

source:eenadu

తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు.. మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత పక్కపక్కనే కూర్చొని కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

source:eenadu

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

source:eenadu

తెలంగాణ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు చెప్పారు.

source:eenadu

రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘బాబా’ చిత్రం గతేడాది డిసెంబర్‌ 10న రీరిలీజ్‌ అయ్యింది. భారీగా వసూళ్లు రాబట్టింది. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన రజనీకాంత్‌ టీమ్‌తో సరదాగా ముచ్చటించారు.

source:eenadu

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(21-07-2025)

Eenadu.net Home