చిత్రం చెప్పే విశేషాలు..!

(18-02-2023/2)

గోపీచంద్ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామబాణం’.ఈ సినిమా టైటిల్‌ ‘రామబాణం’ను గతంలో ప్రభాస్‌తో నిర్వహించిన ‘అన్‌స్టాపబుల్‌’ఎపిసోడ్‌లో నందమూరి బాలకృష్ణ సూచించారు.

source:eenadu

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా మల్లిక్‌రామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘టిల్లు స్క్వేర్‌’. ఈ నేపథ్యంలో చిత్రబృందం అనుపమకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోను పంచుకుంది.

source:eenadu

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పెన్నీ వాంగ్‌కు.. రోహిత్‌ శర్మ ఆటోగ్రాఫ్‌తో ఉన్న బ్యాట్‌ను బహూకరించారు.

source:eenadu

అభిమానులకు ‘ప్రాజెక్ట్‌-కె’చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ ఇది. ఇందులో భారీ చేయి కింద పడి ఉండగా, ముగ్గురు వ్యక్తులు గన్స్‌తో చేయి వైపు గురి పెడుతూ నిల్చున్నారు.

source:eenadu

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బర్కత్‌పురాలోని యాదాద్రి భవన్ నుంచి యాదగిరిగుట్టకు బయల్దేరిన అఖండ జ్యోతియాత్రను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. 

source:eenadu

హైదరాబాద్‌ కొండాపూర్‌లోని జిస్మత్‌ జైల్‌ మండీ రెస్టారెంట్‌లో దేశంలోనే అతిపెద్ద బిర్యానీ ప్లేట్‌ను సినీనటుడు సోనూసూద్‌ ప్రారంభించారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేశారు. 

source:eenadu

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జురు శివాలయం వద్ద శివుని వేషధారణలో భిక్షాటన చేస్తున్న అగస్త్య పీఠం సుగుణానంద స్వామి కుమారులు..

source:eenadu

అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠం.. జోగులాంబ అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

Eenadu.net Home