చిత్రం చెప్పే విశేషాలు..!

(21-02-2023/2)

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది. ఆయన వేరుశనగ పంట పరిశీలించి, రైతులతో ముచ్చటించారు. 

source:eenadu

ఇది ఆక్టోపస్‌ అనుకుంటే పొరపాటే..కానీ ఇవి బొప్పాయి కాయలు. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన గాగ్రూ ఇంటిలోని చెట్టుకు కాశాయి.

source:eenadu

షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన చిత్రం ‘పఠాన్‌’. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్‌ను క్రాస్‌ చేసినట్లు చిత్రబృందం తెలిపింది.

source:eenadu

అల్లరి నరేశ్‌ హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో హీరో నాగచైతన్య విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

source:eenadu

తిరుమల శ్రీవారిని టీమ్‌ఇండియా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. 

source:eenadu

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు విజయవాడలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన రాష్ట్రానికి అందించిన సేవల గురించి సీఎం జగన్‌ కొనియాడారు.

source:eenadu

యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతి యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి, డీసీపీ రాజేశ్‌ చంద్ర, అధికారులు పాల్గొని భక్తులతో కలిసి నడిచారు.

source:eenadu

యాదాద్రి మహాదివ్య క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. పాంచారాత్రాగమ విధానాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

Eenadu.net Home