చిత్రం చెప్పే విశేషాలు..!

(22-02-2023/2)

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని సుందర్‌నగర్‌ కాలనీలో మాజీ కార్పొరేటర్‌ శేషుకుమార్‌ ఇంట్లో ఒక కుండీలో పైపులను అమర్చి ఎనిమిది చిన్న కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. 

source:eenadu

‘ఉగ్రం’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆ సినిమా కథానాయిక మిర్నా మేనన్‌ ఇలా మెరిశారు.

source:eenadu

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని చందనవెల్లి పారిశ్రామిక వాడలో వెల్‌స్పన్‌ అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్ లిమిటెడ్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అక్కడి రోడ్‌షోకు కార్యకర్తలు తరలివచ్చారు.

source:eenadu

సినీనటి నభా నటేశ్‌ నిజామాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిచ్చారు.

source:eenadu

ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మరణించడానికి అనుమతి ఇవ్వాలని మాజీ నక్సలైట్ కోడెం సమ్మయ్య నిరసన తెలిపాడు. ప్రభుత్వం ఇచ్చిన భూమి కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేశాడు.

source:eenadu

అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను సినీనటుడు నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. 

source:eenadu

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. శంషాబాద్‌లోని పంచవటి పార్క్‌లో ఆమె మొక్క నాటారు. జ్యోతిష్కుడు బాలు మున్నంగి ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్క నాటినట్లు కంగనా రనౌత్ చెప్పారు.

source:eenadu

యాదాద్రి పుణ్యక్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు బుధవారం ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

source:eenadu

పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను ముహూర్తపు షాట్‌తో లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో త్రివిక్రమ్‌, తమన్‌ తదితరులు పాల్గొన్నారు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(22-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(21-07-2025)

Eenadu.net Home