చిత్రం చెప్పే విశేషాలు..!
(23-02-2023/2)
యువత పెద్ద కలలు కనాలని, అభిరుచిని వ్యాపారంగా మార్చుకోవాలని అవగాహన కల్పిస్తూ రాయదుర్గంలోని టీ-హబ్ వద్ద ‘3సి ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఫ్లాష్ మాబ్, హార్స్ పరేడ్ నిర్వహించి ఆకట్టుకున్నారు.
source:eenadu
తాడేపల్లిగూడెంలోని నిట్ కళాశాలలో ఉల్కం జీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిట్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పాఠశాలల విద్యార్థులు తిలకించారు.
source:eenadu
వరంగల్‌లోని నిట్ కళాశాలలో ప్రదర్శనకు ఉంచిన ఇస్రో బస్సు
source:eenadu
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వేశాలపల్లిలో పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 544 రెండు పడక గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు బస్సులో వెళ్తున్న ఆయనకు ప్రజలు ఇలా నమస్కరిస్తూ కనిపించారు.
source:eenadu
బంజారాహిల్స్‌లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో గురువారం క్రాఫ్ట్‌మెన్లను సన్మానించారు. కార్యక్రమంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పాల్గొని క్రాఫ్ట్‌మెన్ తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించి వారి నైపుణ్యాన్ని ప్రశంసించారు.
source:eenadu
చైనా నిఘా బెలూన్‌ను యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానంలో నుంచి పైలట్ ఈ నెల 3న చిత్రీకరించాడు. ఈ ఫొటోను అమెరికా రక్షణ శాఖ బుధవారం విడుదల చేసింది.
source:eenadu
రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి-భారతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఎం జగన్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
source:eenadu
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం స్వామివారు మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
source:eenadu
యాక్షన్ సన్నివేశాల్లో హృతిక్ రోషన్‌కు డూపుగా నటించే మన్సూర్ అలీఖాన్ ఇటీవల హృతిక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా ఫొటో పోస్టు చేశారు.
source:eenadu