చిత్రం చెప్పే విశేషాలు..!
(26-02-2023/2)
శంషాబాద్‌కి సమీపంలోని మంఖాల్‌లో ఆలయ్ ఇన్‌ఫ్రా ప్రపంచస్థాయి లగ్జరీ విల్లాస్, బ్రోచర్‌ను చినజీయర్ స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ కంపెనీ యజమానులు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
source:eenadu
రవితేజ హీరోగా, దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్‌కు ప్యాకప్ చెబుతున్నట్లు చిత్రబృందం ఓ ఫొటోను ట్వీట్ చేసింది.
source:eenadu
సంగారెడ్డి జిల్లా కొహిర్ మండలం బడంపేట గ్రామంలో శ్రీ రాచన్నస్వామి, శ్రీ మల్లికార్జున స్వామివార్ల జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు మంత్రి హరీశ్‌రావు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
source:eenadu
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ఘనంగా ప్రారంభమైంది. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
source:eenadu
దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్.. ఇటీవల బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నజీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
source:eenadu
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్వామివారిని 'గోవర్ధన గిరిధారి' అలంకరణలో వీధుల్లో ఊరేగించారు.
source:eenadu
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర తిరుపతి జిల్లా తిరుచానూరులో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ అక్కడి మహిళలతో సెల్ఫీ దిగి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
source:eenadu
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దంపతులు, సుప్రీంకోర్టు జడ్జి పీఎస్ నరసింహ దంపతులు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
source:eenadu