చిత్రం చెప్పే విశేషాలు..!

(04-03-2023/2)

కరీంనగర్‌లో పుస్తక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శనివారం ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. తనకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు.

source:eenadu

సినీనటుడు రవితేజ సముద్ర తీరంలో నడుస్తున్న ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోను చూసి ఆయన ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. 

source:eenadu

గోపీచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామబాణం’. ఈ సినిమాను మే 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. 

source:eenadu

ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సార్‌’ గత నెల 17న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకుంది.

source:eenadu

పెరిగిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ.. హైదరాబాద్‌లోని నారాయణగూడలో సీపీఎం కార్యాలయం వద్ద మహిళా నాయకులు రోడ్డుపై వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు.

source:eenadu

అమెరికాను మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. దీని ప్రభావంతో అక్కడ రవాణా వ్యవస్థ స్తంభించి నిత్యావసరాల కొరత ఏర్పడింది. సరకులు, ఆహారం కోసం కాలిఫోర్నియాలో స్థానికులు షాపింగ్‌ మాల్స్‌ ఎదుట బారులుతీరి కనిపించారు.

source:eenadu

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు.

source:eenadu

మంత్రి హరీశ్‌రావు శనివారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. గుండె సర్జరీ విజయవంతంగా పూర్తిచేసుకున్న చిన్నారులతో ఆయన ముచ్చటించారు.

source:eenadu

భారతదేశ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(23-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(22-07-2025)

Eenadu.net Home