చిత్రం చెప్పే విశేషాలు..!

(08-03-2023/2)

మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ గొప్పదనాన్ని తెలియజేస్తూ..‘శాకుంతలం’ సినిమా బృందం ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేసింది. ‘సెలబ్రేట్‌ ది ఇమ్మెన్స్‌ ఆఫ్‌ మదర్‌హుడ్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. 

Source: Eenadu

మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా కుటుంబ సభ్యులతో కలిసి హోలీ పండగ చేసుకున్నారు. తన సతీమణి, పిల్లలతో దిగిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పోస్టు చేశారు. ‘మా తరఫున మీ అందరికీ హ్యాపీ హోలీ’ అంటూ అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Source: Eenadu

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా చింతపర్తిలో ఆయన మహిళలతో సమావేశం నిర్వహించారు. 

Source: Eenadu

ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌ వేదికగా ఈ ఫొటోలను పంచుకున్నారు. పండగ శోభ ఉట్టిపడేలా ఈ ఫొటోలు తీసిన గుర్‌సిమ్రన్‌ బస్రా, ఆపేక్షలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Source: Eenadu

ప్రముఖ నటుడు చిరంజీవి ట్విటర్‌ వేదికగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి అంజనాదేవి, సతీమణి సురేఖతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. Source: Eenadu

గోపీచంద్ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామబాణం’. ఈ సినిమాలో కథానాయిక డింపుల్‌ హయాతి లుక్‌కు సంబంధించిన ఫొటోను చిత్రబృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

Source: Eenadu

అల్లు అర్జున్ తన కుమార్తె అర్హతో కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్‌ సతీమణి స్నేహారెడ్డి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

Source: Eenadu

బేగంపేట్‌లో కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రెయిన్ డాన్స్, మ్యూజిక్ మస్తీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో యువత పెద్దఎత్తున పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.

Source: Eenadu


 భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ తదితరులు అహ్మదాబాద్‌లోని మైదానంలో ప్రాక్టీసు చేస్తూ కనిపించారు. 

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home