చిత్రం చెప్పే విశేషాలు..!

(15-03-2023/2)

నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 16న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

source:eenadu

సినీ నటీ నభా నటేశ్‌ నలుపు రంగు దుస్తుల్లో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

source:eenadu

పంజా వైష్ణవ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పీవీటీ 04’. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్‌.. ‘చెంగారెడ్డి’ అనే పాత్రలో కనిపించనున్నారు.

source:eenadu

లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. ఈ సినిమా షూటింగ్‌లో కంగన, లారెన్స్‌ ఇలా మెరిశారు.

source:eenadu

లాస్‌ ఏంజెలెస్‌లోని రీజెన్సీ విలేజ్‌ థియేటర్‌లో ‘షజామ్‌.. ఫ్యూరీ ఆఫ్‌ ది గాడ్స్’ సినిమా ప్రీమియర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సినిమా నటి రాచెల్‌ జగ్లర్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

source:eenadu

ఉపాసన ట్విటర్‌ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. స్వచ్ఛమైన హృదయంతో ఆశయ సాధనకు కృషి చేస్తే విజయం తప్పక వరిస్తుందని ఆమె చెప్పారు. రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను ఉపాసన పంచుకున్నారు.

source:eenadu

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దాస్‌ కా దమ్కీ’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 17న నిర్వహించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇందులో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ పాల్గొంటున్నారు.

source:eenadu

సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. చిత్రబృందం జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసింది. సమంత, దేవ్‌మోహన్‌, గుణశేఖర్‌ తదితరులు పూజల్లో పాల్గొన్నారు.

source:eenadu

హనుమకొండలో దివ్యాంగుడైన విద్యార్థిని పరీక్ష కేంద్రానికి తీసుకువస్తున్న సహాయకుడు

source:eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(24-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(24-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(23-07-2025)

Eenadu.net Home