చిత్రం చెప్పే విశేషాలు..!

(18-03-2023/2)

విశాఖ తీరప్రాంతం జోడుగుళ్లపాలెం సమీప కొండలపై అందమైన చిత్రాలను తీర్చిదిద్దుతున్నారు. ఇవి ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

source:eenadu

ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆదిత్య ఠాక్రే.. తలైవాకు ఆతిథ్యమివ్వడం తమ అదృష్టమని తెలుపుతూ పోస్టు పెట్టారు.

source:eenadu

హైదరాబాద్‌లోని కొంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ కాఫీ షాప్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ను సినీనటి నేహాశెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి వివిధ రకాల కాఫీ, ఐస్‌క్రీమ్‌లను రుచి చూశారు.

source:eenadu

హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణాలో శనివారం సూత్ర ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సినీనటి రాశీసింగ్‌ పాల్గొని నూతన డిజైన్ల దుస్తులు, ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు.

source:eenadu

పోర్ట్‌ బ్లెయిర్‌లో 12 నుంచి 70ఏళ్ల మధ్య వయసు గల వారికి ఓపెన్‌ సీ స్విమ్మింగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 200 మందికిపైగా వ్యక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

source:eenadu

నాని హీరోగా దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌ తెరకెక్కించిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

source:eenadu

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌ను సందర్శించారు. అక్కడి వివేకానంద విగ్రహానికి నివాళి అర్పించడంతో పాటు భరతమాత విగ్రహానికి నమస్కరించారు.

source:eenadu

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’ . నివేదా పేతురాజ్‌ కథానాయిక. మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో నివేదా పేతురాజ్‌ ఇలా మెరిశారు.

source:eenadu

చిత్రం చెప్పే విశేషాలు..!(20-03-2023/1)

చిత్రం చెప్పే విశేషాలు..!(19-03-2023/2)

చిత్రం చెప్పే విశేషాలు..!(19-03-2023/1)

Eenadu.net Home