చిత్రం చెప్పే విశేషాలు..!

(22-03-2023/2)

కృష్ణా జిల్లా కోడూరులో కొబ్బరి చెట్లపై పిడుగు పడి చెట్ల తల మొత్తం మోడు బారిపోయింది. అయినప్పటికీ చెట్ల మొదళ్లో అలుముకున్న తీగచెట్లు పచ్చగా ఉన్నాయి.

source:eenadu

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయిలో ఉన్న నాని, కీర్తి, రానా ఉత్సహంగా ఉగాదిని సెలబ్రేట్‌ చేసుకున్నారు. 

source:eenadu

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. 

source:eenadu

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం వైభ‌వంగా ఉగాది ఆస్థానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని పూలతోరణాలు, వివిధ కళాకృతులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

source:eenadu

నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, నాయకులు ఆసక్తిగా శుభకృత్‌ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. 

source:eenadu

 రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమాకు సంబంధించిన ‘డిక్క డిష్యూం’ అనే మాస్‌ సాంగ్‌ను ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

source:eenadu

మంగళగిరి తెదేపా జాతీయ పార్టీ కార్యాలయంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

source:eenadu

మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి పూజ చేస్తున్న ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. 

source:eenadu

చిత్రం చెప్పే విశేషాలు (15-06-2024)

జీ7 సదస్సు.. విశేషాలివీ!

చిత్రం చెప్పే విశేషాలు (14-06-2024)

Eenadu.net Home