చిత్రం చెప్పే విశేషాలు..!
(26-03-2023/2)
భారత క్రికెటర్ అశ్విన్ తన తాజా ఫొటోను ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. చెస్ ఆడుతూ కొబ్బరి బొండాం తాగుతుంటే వచ్చే మజా వేరే అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
source:eenadu
భారత క్రికెటర్ రోహిత్‌శర్మ తన సతీమణి రితికతో దిగిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. జోడీ బాగుందని కితాబిస్తూ ఆయన ఫ్యాన్స్ ఈ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు.
source:eenadu
వరుణ్‌తేజ్ హీరోగా శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీటీ 13’(వర్కింగ్ టైటిల్). ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ఇలా మేకోవర్ అయ్యారు.
source:eenadu
నటి మీనాక్షి చౌదరి ఇటీవల ఓ సినిమా షూటింగ్ ప్రారంభ కార్యక్రమంలో ఇలా మెరిశారు. ఈ ఫొటోలను పలువురు ట్విటర్‌లో పంచుకోగా ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
source:eenadu
రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న రిషభ్ పంత్‌ను మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, శ్రీశాంత్ పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
source:eenadu
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’(వర్కింగ్ టైటిల్). ఈ నేపథ్యంలో సుజిత్.. సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్‌తో కలిసి షూటింగ్ లొకేషన్స్ వెతికే పనిలో నిమగ్నమయ్యారు.
source:eenadu
బెంగళూరులో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో సినీనటి ఈషా రెబ్బా ఇలా మెరిశారు.
source:eenadu
సుడిగాలి సుధీర్ ప్రముఖ నటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సుధీర్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
source:eenadu
సినీనటుడు ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతికి ఇన్‌స్టా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అమ్ములు’ అని తెలుపుతూ ఈ ఫొటోను పంచుకున్నారు.
source:eenadu