చిత్రం చెప్పే విశేషాలు..!
(28-03-2023/2)
తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్వామి వారికి చక్రస్నానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Source: Eenadu
హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలో 200 పడకలతో ఏర్పాటు చేయనున్న ఆసుపత్రికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను నాయకులు పరిశీలించారు.
Source: Eenadu
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 20ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా ఆయన ఓ ఫొటోను పంచుకున్నారు. గంగోత్రి నుంచి పుష్ప సినిమా వరకు బన్నీ విభిన్న పాత్రలతో అలరించారు.
Source: Eenadu
సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Source: Eenadu
అజయ్‌దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫుట్‌బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను మార్చి 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Source: Eenadu
ప్రముఖ దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Source: Eenadu
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఓ పార్కులో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సీతాకోక చిలుక ఆకారంలో బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కును అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
Source: Eenadu
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మంగళవారం ముగిశాయి. పరీక్ష అనంతరం కరీంనగర్‌లో విద్యార్థినులు ఇలా ఉత్సాహంగా కనిపించి ఫొటోలకు పోజులిచ్చారు.
Source: Eenadu