చిత్రం చెప్పే విశేషాలు..!
(30-03-2023/2)
సినీనటుడు నిఖిల్.. హిందుస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఓటీటీ ప్లే ఛేంజ్‌మేకర్ అవార్డ్స్ 2023’ ప్రదానోత్సవంలో ‘ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.
Source: Eenadu
రవితేజ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రావణాసుర’. ఏప్రిల్ 7న విడుదల కానుంది. చిత్రబృందం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్ వేదికగా ఈ ఫొటోను పంచుకుంది.
Source: Eenadu
సినీనటి ఐశ్వర్యలక్ష్మి తాజా ఫొటోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.
Source: Eenadu
పుత్తూరులోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా దంపతులు రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
Source: Eenadu
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శ్రీరామ నవమి సందర్భంగా పూజలో పాల్గొన్న ఫొటోను ట్విటర్ వేదికగా పోస్టు చేశారు.
Source: Eenadu
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామబాణం’. సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా చిత్రబృందం ఈ పోస్టర్‌ను ట్విటర్ వేదికగా పంచుకుంది.
Source: Eenadu
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాకు సంబంధించిన ఈ పోస్టర్‌ను చిత్రబృందం ట్విటర్ వేదికగా పంచుకుంది.
Source: Eenadu
నాని, కీర్తి సురేశ్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దసరా’ నేడు విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా నటీనటులు, చిత్రబృందం కేకు కోసి వేడుకలు చేసుకున్నారు.
Source: Eenadu
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్కార్ అందుకున్న గేయ రచయిత చంద్రబోస్.. ‘భోళా శంకర్’ సినిమా సెట్స్‌లో ప్రముఖ సినీనటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Source: Eenadu