చిత్రం చెప్పే విశేషాలు..!

(01-04-2023/2)

ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహాద్రి’ సినిమా 2003లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో సినిమా రీరిలీజ్‌ తేదీని ఏప్రిల్‌ 9న ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమాను ఏప్రిల్‌ 21న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

Source: Eenadu

నాని, కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా రెండు రోజుల్లో రూ.53కోట్ల వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.

Source: Eenadu

బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమానాశ్రయంలో ఆమెను కలిసి సత్కరించారు. 

Source: Eenadu

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గాను సంగీత దర్శకుడు కీరవాణి ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ నటులు వెంకటేశ్‌, నాగార్జున అక్కడ కీరవాణిని కలిసి అభినందనలు తెలిపారు.

Source: Eenadu

భద్రాద్రి సీతారాముల ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకను వీక్షించారు.

Source: Eenadu

సినీనటి జాన్వీకపూర్‌ తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్‌ ముగ్ధులవుతున్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌ 30’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Source: Eenadu

తన తండ్రి, ప్రముఖ నటుడు రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫొటోను సౌందర్య రజనీకాంత్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘తలైవా కొత్త లుక్‌ అదిరిపోయింది’ అంటూ పోస్టు పెట్టారు.

Source: Eenadu

 సమంత, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొచిలో నిర్వహించిన ప్రైస్‌మీట్‌లో సమంత ఇలా మెరిశారు.

Source: Eenadu

సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘భువన విజయమ్‌’. యలమంద చరణ్‌ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన ‘కథన.. కదనమున..’అనే వీడియో సాంగ్‌ను ఏప్రిల్‌ 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. 

Source: Eenadu

చిత్రం చెప్పే విశేషాలు (25-04-2024/1)

రెడ్‌ బ్యూటీ..

నేనే బొమ్మనైతే...

Eenadu.net Home