చిత్రం చెప్పే విశేషాలు..!
(11-04-2023/2)
మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన నివాసంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Source: Eenadu
మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Source: Eenadu
‘దాస్ కా ధమ్కీ’ తో ప్రేక్షకులను అలరించిన కథానాయిక నివేతా పేతురాజ్ . ఈ బ్యూటీ తన తాజా ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. తన పెంపుడు పిల్లితో కలిసి దిగిన ఫొటోలో ఆమె అందంగా కనిపిస్తోంది. ‘నా మంచి నేస్తం’ అని ఆమె ట్వీట్ చేశారు.
Source: Eenadu
సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త కథానాయిక. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది.
Source: Eenadu
విరాట్ కోహ్లీ తన కుమార్తె వామికతో కలిసి స్విమ్మిగ్‌పూల్ వద్ద దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. వేసవిలో చల్లగా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉన్న ఈ ఫొటోను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Source: Eenadu
సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’నుంచి ‘నాటు నాటు’సాంగ్ ఈ ఏడాది అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ పాట గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ను మంత్రి హరీశ్‌రావు సత్కరించారు.
Source: Eenadu
సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
Source: Eenadu
నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా లోకేశ్ ఫులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Source: Eenadu
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చరిత్రాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’. అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న ఈ సినిమాను 4డీఎక్స్ క్వాలిటీతో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Source: Eenadu