చిత్రం చెప్పే విశేషాలు..!

(30-09-2023/2)

మంత్రి కేటీఆర్‌ ఖమ్మం నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. 

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అశోక వన్‌మాల్‌ వద్ద ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా 5కే వాక్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. డీజే టిల్లు చిత్రంలోని పాటలకు స్టెప్పులు వేసి సందడి చేశారు.

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టింది. విజయవాడలో ఆందోళన చేస్తున్న పలువురు నాయకులు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో జాతీయ రహదారికి అనుకొని ఉన్న ఇప్పలకుంట చెరువు వద్ద ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. కానీ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. విరిగిపోయిన ఊయలలు, పనిచేయని ఫౌంటెన్, పరిసరాలు చెత్తాచెదారంతో దర్శనమిస్తాయి.

కర్నూలుజిల్లా అవుకు సమీపంలోని కొండలనుంచి జాలు వారుతున్న నీటి వనరులు స్థానికులను ఆనందపారవశ్యంలో ముంచెత్తాయి. పాలేరు వాగు వద్ద పొంగి ప్రవహిస్తున్న జలపాతాన్ని చూడొచ్చు.

ప్రకాశంజిల్లా కొమరోలు మండలంలోని రెడ్డిచెర్ల ఎస్సీ కాలనీలోని నీటి ట్యాంక్‌ను గత ఆరు నెలలుగా శుభ్రం చేయకపోవడంతో పాచిపట్టి దుర్వాసన వస్తోంది. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

నంద్యాలలో తెదేపా పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో 

రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, అశోక్‌ బాబు, అనిత, బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలానికి చెందిన తెలుగు యువత నాయకులు శనివారం ఉదయం రాజమహేంద్రవరంలో నారా బ్రాహ్మణిని కలిశారు.

చిత్రం చెప్పేవిశేషాలు(09-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(09-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(08-05-2025)

Eenadu.net Home