చిత్రం చెప్పే విశేషాలు..!(01-10-2023/2)

లేహ్‌: లద్దాఖ్‌లోని 19,024 అడుగుల ఎత్తైన ప్రదేశంలో అంతర్జాతీయ ఫ్యాషన్‌ షో నిర్వహించడంద్వారా ప్రపంచ రికార్డు నమోదైంది. వైబ్రంట్‌ లద్దాఖ్‌ ఉత్సవాల్లో భాగంగా ఈ ఫ్యాషన్‌ షో జరిగింది. 

భారత్‌ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌ కోసం ‘బ్లేజ్‌’, ‘టాంక్‌’ వచ్చేశారు. వీళ్లు క్రికెటర్లు కాదు ప్రపంచకప్‌ మస్కట్లు. ఆగస్టులోనే ఈ మస్కట్లను ఆవిష్కరించిన ఐసీసీ.. వీళ్లకు పేర్లు పెట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులను కోరింది. 

తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. పవిత్రమైన పురటాసి మాసంలో రెండో శనివారంతో పాటు వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా వస్తున్నారు. తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులు, పార్కింగ్‌ ప్రాంతాలన్నీ భక్తులు, వాహనాలతో నిండిపోయాయి. 

ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రభుత్వ మనసు కరగడం లేదని వాపోతున్నారు. శనివారం పరిగి మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో పొర్లు దండాలతో నిరసన, ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా రాస్తారోకో చేస్తున్న విద్యార్థినులను పోలీసులు అరెస్టు చేశారు. పదుల సంఖ్యలో వచ్చిన పోలీసుల అరెస్టుల నుంచి విద్యార్థినులు తమను తాము కాపాడుకుంటూ నినాదాలు చేశారు.  

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తృతీయ ఫైన్ జువెల్లరీ షోరూమ్‌ను ప్రారంభించారు. ఈవెంట్‌లో టాలీవుడ్‌ సెలబ్రిటీలు, తారలు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

విజయవాడలో ‘అను మై బేబీ’ ఆసుపత్రి రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో గర్భిణులు ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. సినీ నటీమణులు ఆమని, పూర్ణ సందడి చేశారు.

హైదరాబాద్‌లో ‘తెలుగు జాతీయం చంద్రబోస్‌’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు ప్రదీప్‌ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకి ప్రముఖ నటుడు మురళీమోహన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 12 రకాల జ్ఞాపికలతో చంద్రబోస్‌ని సత్కరించారు.

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో ఆదివారం ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, గ్రాడ్యుయేట్లు, లాయర్ల ర్యాలీ నిర్వహించారు.

మహనీయుడు చెప్పిన మంచిమాటలు

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home