చిత్రం చెప్పే విశేషాలు..!
(22-01-2023/2)
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. మెస్రం వంశీయుల కొత్త కోడళ్లు నైవేద్యం కోసం కోనూరు నుంచి నీరు తీసుకురావడం విశేషం.
Source: Eenadu
నార్సింగిలో తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం-2023 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, దర్శకుడు రాఘవేంద్రరావు, పద్మశ్రీ శోభరాజ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
Source: Eenadu
ఈజిప్టు ఉటాలోని పార్క్ సిటీలో ‘సన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2023’ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈజిప్షియన్ థియేటర్ డివినిటీలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు నటి బెల్లా థోర్న్ హాజరై ఫొటోలకు పోజులిచ్చారు.
Source: Eenadu
ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Source: Eenadu
హైదరాబాద్ గాజులరామారంలోని చిత్తారమ్మతల్లి జాతరకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. పలువురు మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Source: Eenadu
సందీప్‌కిషన్ హీరోగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మైఖేల్’. సోమవారం ఉదయం 9.30గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Source: Eenadu
ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభోత్సవంలో సినీ నటీమణులు అనుపమ పరమేశ్వరన్, శ్రీలీల పాల్గొని సందడి చేశారు.
Source: Eenadu
హైదరాబాద్‌లోని మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ హోటల్‌ను సినీనటుడు నితిన్ ప్రారంభించారు.
Source: Eenadu